Advertisement
Google Ads BL

రామ్ ఈసారి కొట్టేట్లే ఉన్నాడు


రామ్‌ పోతినేని.... సుప్రసిద్ద నిర్మాత స్రవంతి రవికిషోర్‌ వారసునిగా నటునిగా మారాడు మొదటి చిత్రం 'దేవదాస్‌' తోనే బ్లాక్‌బస్టర్‌ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'జగడం' చిత్రం కేవలం ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. 'రెడీ, మస్కా' చిత్రాలు ఫర్వాలేదనిపించాయి.'రామ రామ కృష్ణ కృష్ణ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగచేస్కో, శివం, హైపర్‌' వంటి పరాజయాలు మూటగట్టుకున్నాడు. 'కందిరీగ, నేను శైలజా' చిత్రాలు బాగా ఆడాయి. 'ఉన్నది ఒకటే జిందగీ'కి మంచి టాక్‌ వచ్చినా సినిమా విజయం సాధించలేకపోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఈయన చాలా కాలం తర్వాత అంటే 'రామ రామ కృష్ణ కృష్ణ' తర్వాత దిల్‌రాజు బేనర్‌లో రెండోసారి ఓ చిత్రం చేస్తున్నాడు. 'సినిమా చూపిస్తా మావా, నేను లోకల్‌' వంటి చిత్రాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించగలడు అనే పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రస్తుతం నాగార్జున 'నిర్ణయం'లోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ 'హలో గురు ప్రేమ కోసమే'  అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు. హీరో హీరోయిన్లపై రొమాంటిక్‌ సీన్స్‌కి పెద్ద పీట వేస్తూ ఈ టీజర్‌ని తయారు చేశారు. ఇంతకు ముందు చిత్రాలకంటే ఇందులో రామ్‌ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఎంతో గ్లామరస్‌గా ఉంది. ఈ చిత్రంలో ప్రణీత, ప్రకాష్‌రాజ్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. 

'శ్రీనివాసకళ్యాణం'తో నితిన్‌తో చేసిన రెండో చిత్రం ద్వారా ఫ్లాప్‌ని అందుకున్న దిల్‌రాజు రామ్‌తో చేస్తోన్న ఈ రెండో చిత్రం ద్వారా ఎలాంటి ఫలితం సాధిస్తాడు? వరుస పరాజయాల్లో ఉన్న రామ్‌కి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ని ఇవ్వనుంది? ఉన్నది ఒకటే జిందగీతో పెద్దగా హిట్‌ కొట్టలేకపోయిన రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంట ఈ చిత్రంతో ఎంతటి హిట్‌ని సొంతం చేసుకుంటారు? అనేవి వేచిచూడాల్సివుంది...! 

Ram Hello Guru Premakosame Teaser Released:

Hello Guru Premakosame Teaser Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs