Advertisement
Google Ads BL

వీరరాఘవుడికి పోటీగా దేవ, దాసు..!!


ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ఉంది. ఇటీవలే 'మహానటి'తో పెద్ద హిట్‌ కొట్టి మరలా ఫామ్‌లోకి వచ్చిన సీనియర్‌ నిర్మాత అశ్వనీదత్‌ తమ వైజయంతీ మూవీస్‌ పతాకంపై దీనిని నిర్మిస్తున్నాడు. మరోవైపు ఆయన దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు 25వ ప్రతిష్టాత్మక చిత్రం 'మహర్షి'కి కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్ల హవా నడుస్తోంది. సరికొత్త, విభిన్న, వైవిధ్యభరితమైన చిత్రాలను వారు తెరకెక్కిస్తూ సంచలనాలు నమోదు చేస్తున్నారు. ఈ కోవలోకే నాగార్జున, నాని నటిస్తున్న 'దేవదాస్‌' చిత్రం కూడా వస్తుంది. 'భలే మంచి రోజు, శమంతకమణి' వంటి రెండు చిన్నతరహా హీరోలతో చిత్రాలను తీసిన దర్శకుడు శ్రీరాం ఆదిత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇందులో నాని సరనస సంచలన నటి రష్మికా మందన్న, నాగార్జున సరసన ఆకాంక్షసింగ్‌లు నటిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. దీంతో ఈనెల 20వ తేదీన ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండటం విశేషం. గత కొంతకాలంగా పెద్ద స్టార్స్‌ చిత్రాల అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోన్న మణిశర్మకి ఈ చిత్రం ఎంతో ముఖ్యం. ఇక ఇందులోని 'లక లక' పాటకు ఎంతో మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన 'హేబాబు' అనే ఈ పాటను కార్తీక్‌, రమ్య బేహారా ఆలపించారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో రావు రమేష్‌, నరేష్‌, శ్రీనివాస్‌ అవసరాల, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. 

మరోవైపు ఈ నెల20 వ తేదీనే ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం ఆడియో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించాడు. సో.. ఒకే రోజున నందమూరి, అక్కినేని ఫ్యామిలీలకు పండుగ వాతావరణం రానుండటం విశేషంగా చెప్పాలి. మరి ఈ రెండు చిత్రాల ఆడియోలకు ఎవరు ముఖ్య అతిధులుగా వస్తారో వేచిచూడాల్సివుంది.....! 

Aravinda Sametha Audio vs Devadas Audio:

Happy news to Nandamuri and Akkineni Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs