Advertisement
Google Ads BL

ఈ హీరో.. సకల కళా వల్లభుడంట..!


తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు శివగణేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ.. ‘‘పూర్తి కమర్షియల్ హంగులతో కూడిన విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోళ్లపందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన ఓ మేనరిజం.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది...’’ అని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పెద్ద హీరోల చిత్రాలలో ఉండే ఫైట్స్, డ్యాన్స్‌లకు.. ఎక్కడా తీసిపోకుండా మా హీరో పెరఫార్మన్స్ ఉంటుంది. కథ, కథనాలలో కొత్తదనంతో పాటు నటీనటుల పెరఫార్మెన్స్  ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన, సింగర్ గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ బుధవారం మరో పాటను, ఆ తర్వాత రెండు రోజులకు టీజర్‌ను విడుదల చేయనున్నాము. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర (గరుడవేగ ఫేమ్) ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన కొందరి సినీ పెద్దల నుంచి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని అన్నారు. 

తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త, 30 ఇయర్స్ పృథ్వీ, జీవా, సుమన్, చిన్నా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయిచరణ్, ఎడిటింగ్: ధర్మేంద్ర (గరుడవేగ ఫేమ్), నిర్మాతలు: అనిల్ ‌కుమార్, కిషోర్, త్రినాధ్, శ్రీకాంత్, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శివగణేష్. 

New Hero Turns Sakalakala Vallabhudu:

<h1>Sakalakala Vallabhudu Movie in Censor Stage</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs