Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు ఏంటీ క్రేజ్..!!


నట జీవితంలో ఎదురులేని మనిషి, రాజకీయాలతో రికార్డులను సృష్టించిన మహోన్నత వ్యక్తి అయిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని ఆయన బిడ్డ బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ గా క్రిష్ దర్శకత్వంలో  మరో ఇద్దరితో కలిసి స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్నప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. ఎన్టీఆర్ నట జీవితం ఒక ఎత్తు అన్నట్టుగా సాగే ఈ బయోపిక్ పై కేవలం ప్రేక్షకుల్లోనే కాదు... ట్రేడ్ లోను మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే బాలయ్య సినిమాలన్నిటిలో ఎన్టీఆర్ బయోపిక్ మీద ఓవర్సీస్ లో భారీ క్రేజ్ ఏర్పడిన విషయం ఈ మధ్య బాగా హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

మరి మూడు భాషల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన బిజినెస్ కూడా ఓవర్సీస్ లెక్కలతో మొదలైందని సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ డిజిటిల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా ఈ డీల్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలను భారీ ధరలకు ఎగరేసుకుపోతున్న అమెజాన్ ప్రైమ్ వారు ఇప్పుడు ఎన్టీఆర్ డిజిటల్ హక్కులను 15 కోట్లకు డీల్ చేసినట్లుగా ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. అమెజాన్ కి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలకు డిజిటల్ హక్కులకైనా 15 కోట్ల డీల్ కుదిరిందని.. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ ఎన్టీఆర్ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ డీల్ నిజమా.. కాదా.. అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాకపోతే ఎన్టీఆర్ డిజిటల్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందనేది మాత్రం నిజం. మరి ఎన్టీఆర్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఎంత అభిమానముందో.. వేరే చెప్పక్కర్లేదు.  అందుకే ఆ మహోన్నత వ్యక్తి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంత క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల డీల్ తో పూర్తవుతుందనేది ట్రేడ్ అంచనా. అయితే ఇప్పటికే ఓవరాల్ రైట్స్ కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఓవరాల్ గా ఎన్టీఆర్ థియేటర్స్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కూడా అన్ని కలిపి ఒకే వ్యక్తి చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కాకపోతే ఈ విషయంలో బాలకృష్ణ బాగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Shocking Offer to NTR Biopic for Digital Rights:

NTR Biopic Digital Rights Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs