Advertisement
Google Ads BL

దేవ-అందమైన అమ్మాయ్, దాసు- మెట్రోలో రింగ్


శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున - నాని హీరోలుగా దేవదాస్ అనే మల్టీస్టారర్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్స్ ని అటు నాగ్ ఇటు నాని ఒక డిఫ్రెంట్ స్టయిల్ లో మొదలెట్టేసారు. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవదాస్ సినిమా పాటలు ఇప్పటికే మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. నాని, నాగార్జున, డాక్టర్... డాన్ గా కనబడనున్న ఈసినిమాలో నాని సరసన గీత గోవిందం తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రష్మిక మందన్న, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ లు నటిస్తున్నారు. ఇప్పటివరకు దేవ, దాస్ లుక్ మాత్రం విడుదల చేసిన దేవదాస్ టీం ఇప్పుడు దేవదాస్ ల చేతుల మీదుగా వాళ్ళ ప్రియురాళ్ల లుక్స్ ని విడుదల చేశారు.

Advertisement
CJ Advs

నాగార్జున అయితే ఎంతో ఫన్నీగా ఇంత అందమైన అమ్మాయితో రొమాన్స్ చేసే అవకాశం చాన్నాళ్ళకి తనకు దక్కిందని... తన ప్రియురాలు ఆకాంక్ష సింగ్ ని కొంటెగా అందంగా పోస్టర్ రూపంలో పరిచయం చెయ్యగా.. నాని కూడా తన ప్రేయసి రష్మిక ని.. పూజ పాత్రలో పరిచయం చేస్తూ .. రష్మిక లుక్ ను నాని.... ఫస్టు టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్ అయింది పూజ గారు .. మళ్లీ ఎప్పుడు.. అంటూ తన ప్రేయసిని ప్రేక్షకులకు పరిచయం చేసాడు. మరి ఇలా దేవదాస్ లు తమ ప్రేయసీలను ఇలా కొంటెగా పరిచయం చేసి భలే మజాగా ఉందే అనిపించారు.

మరి నిజంగా నాని, నాగ్ లు ఎంతో అందంగా కొంటెగా పరిచయం చెయ్యడం కాదుగాని .. నాని లవర్ పూజ లుక్ లో రష్మిక మందన్న సీంప్లి సూపర్బ్ గా అదరగొడుతుంటే.. ఆకాంక్ష సింగ్ కూడా అంతే సింప్లీ సూపర్బ్ లుక్ లో జాహ్నవిగా అదిరిపోయింది. ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న దేవదాస్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా వుంది. ఇక నాగార్జున కి ఆఫీసర్ వంటి డిజాస్టర్ తర్వాత, నాని కి కృష్ణార్జున యుద్ధం వంటి ప్లాప్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి నాగ్ కి నానికి ఈ సినిమా హిట్ ఎంతో కీలకం.

Deva and Dasu Introduces Their Lovers:

Rashmika turns Pooja and Akanksha Sing turns Jahnavi for Dasu and Deva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs