‘ఖైదీ..’ని బీట్ చేసిన గోవిందుడు.. నెక్ట్స్..?

geetha govindham,khaidi no 150,overseas,beat,chiranjeevi,vijay deverakonda | ‘ఖైదీ..’ని బీట్ చేసిన గోవిందుడు.. నెక్ట్స్..?

‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి’ల తర్వాత విజయ్‌దేవరకొండ నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. గీతాఆర్ట్స్‌2 బేనర్‌లో బన్నీవాస్‌ నిర్మాతగా అల్లుఅరవింద్‌ సమర్పణలో పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఇందులో రష్మికా మండన్న హీరోయిన్‌గా నటించింది. ఆగష్టు15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో కూడా విపరీతమైన కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఎందరో యంగ్‌స్టార్స్‌ సాధించలేని 100కోట్ల క్లబ్‌ ఫీట్‌ని సాధించింది. ఈ చిత్రంతో తెలుగుకి మరోస్టార్‌ పరిచయం అయ్యాడని స్వయంగా చిరంజీవి, అల్లుఅరవింద్‌లు అధికారికంగా ప్రకటించారు. 

ఇక విజయ్‌ అభిమానులైతే ఎంతో బ్యాగ్రౌండ్‌, ఎన్నో సినిమాల అనుభవం ఉన్న స్టార్స్‌ కూడా సాధించలేని ఫీటుని అతి తక్కువ సినిమాలతోనే తమ హీరో సాధించాడని.. ఇతర హీరోలను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఈ చిత్రం విడుదల వరకు స్ట్రాంగ్‌గా సాగుతోన్న ‘గూఢచారి’ని దెబ్బకొట్టడమే కాదు.. ఆ తర్వాత వచ్చిన ‘కేరాఫ్‌ కంచరపాళెం, యూటర్న్‌, శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాలకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇక యూఎస్‌లో ఈ సినిమా ఫుల్‌ రన్‌ ముగిసినట్లే భావించాలి. ఇలా ముగింపు దశలోనూ ఈ చిత్రం మరో అరుదైన రికార్డును క్రియేట్‌ చేసింది. చిరంజీవి దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ, తన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంగా చేసిన ‘ఖైదీనెంబర్‌ 15’ కలెక్షన్లను ‘గీతాగోవిందం’ ఓవర్‌సీస్‌లో బ్రేక్‌ చేసింది. 

యూఎస్‌లో ‘ఖైదీనెంబర్‌ 150’ చిత్రం 2.42 మిలియన్స్‌ వసూలు చేయగా, ‘గీతాగోవిందం’ చిత్రం 2.44 మిలియన్స్‌ని చేరుకుంది. ఇక ఈ చిత్రం ‘మహానటి’ కలెక్షన్లను దాటుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మహానటి చిత్రం యూఎస్‌లో 2.5 మిలియన్స్‌ని వసూలు చేసింది. ఈ రికార్డును కూడా సాధిస్తే ‘గీతాగోవిందం’ ఆల్‌టైం 6లో స్థానం సంపాదించుకుంటుంది. ‘బాహుబలి రెండు పార్ట్‌లు, రంగస్థలం, భరత్‌ అనే నేను, శ్రీమంతుడు’ చిత్రాలు మొదటి ఐదు స్థానాలలో ఉన్నాయి. ఆరోస్థానంలో ‘గీతాగోవిందం’ నిలిచే అవకాశం ఉంది. 

Vijay Deverakonda beats Chiranjeevi at Overseas:

Geetha Govindham beats Khaidi No 150 at Overseas
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES