Advertisement
Google Ads BL

పూజాకి ఎన్టీఆర్ ఎలా కనెక్ట్ అయ్యాడు?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత… వీరరాఘవ’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ అని తెలిసిన విషయమే. ఇందులో పూజా జ‌ర్న‌లిస్ట్‌గా కనిపించనుందని టాక్ వస్తుంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఇలా జ‌ర్న‌లిస్ట్‌గా కనిపించలేదు. తొలిసారిగా పూజా కనిపించనుంది. విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, వీడియో జ‌ర్న‌లిస్ట్‌గా పూజా ఇందులో కనిపించనుందట. మరి ఆమెకు, ఎన్టీఆర్‌కు ఎలా సెట్ అవుతుందనేదే అరవిందలో ఉన్న అసలు మ్యాటర్ అని టాక్.

Advertisement
CJ Advs

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇక పూజా హెగ్డే, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయని ఫిలింనగర్ సమాచారం. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్ర పాటలు డైరెక్ట్‌గా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తొలిసారి వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

Pooja Hegde Role in Aravinda Sametha:

Aravinda Sametha Movie Latest Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs