Advertisement
Google Ads BL

స్టార్స్‌ని దూషిస్తే ఎలా ఉంటుందో తెలియాలని?


ప్రతి ఒక్కరికి అది సెలబ్రిటీ అయినా.. కామన్‌మేన్‌ అయినా ఎవరి మనోభావాలు, ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయి. అందునా స్టార్స్‌ విషయానికి వస్తే తమ అభిమాన హీరో మనోభావాలు, ఇష్టాయిష్టాలనే తమదిగా భావించే కోట్లాది అభిమానులు ఉంటారు. కానీ స్టార్స్‌ని టార్గెట్‌ చేస్తే సులభంగా సెలబ్రిటీలు అయిపోవచ్చు. తమకు క్షణంలో ఊహించని గుర్తింపు వస్తుందని పెడత్రోవ, ఆలోచనలోనేడు బాగా కనిపిస్తున్నాయి. దీనికి ‘జబర్దస్త్‌’ షోలో పలువురు గౌరవనీయులైన స్టార్స్‌ మీద వచ్చే అవాక్కులు, చెవాక్కులు, వారిని కించపరుస్తూ దానినే వినోదంగా భావించే స్కిట్స్‌, కత్తి మహేష్‌ వంటి వారు రోజురోజుకి మీడియా పుణ్యాన పెరిగిపోతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుని మనోజ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి చేసిన వెకిలి మాటలు.. ప్రిన్స్‌ అభిమానుల మనసులను ఎంతగానో గాయపరిచాయి. అయితే మనోజ్‌కి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే విషయం త్వరగానే అర్ధమవుతోందని చెప్పాలి. ఈ మనోజ్‌ ప్రభాకర్‌.. మహేష్‌ మీద చేసిన వెకిలిచేష్టలతో ప్రిన్స్‌ అభిమాన గణం కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన మనోజ్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. కానీ ఇందులో కూడా తన అహంకారాన్ని చాటుకోవడంతో ప్రిన్స్‌ అభిమానులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన పాల్గొనే ఓ షోకి సంబంధించిన వివరాలను ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసి.. తన తప్పు తెలుసుకునేలా చేశారు.

చెన్నైలోని హరిశ్రీ విద్యాలయంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో మనోజ్‌ ప్రభాకర్‌ పాల్గొన్నాడు. ఈ షోకి వెళ్లి ఆయనకు తమ నిరసనను తెలిపారు ప్రిన్స్‌ అభిమానులు. వాక్‌ స్వాతంత్య్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కామెడీ పండించాలని చూస్తే ఎలా ఉంటుందో మనోజ్‌కి తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే వృత్తిపరంగా విమర్శలు చేసి, వాటి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలే గానీ ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడుసు తొక్కి కాలు కడుగుకున్నట్లుగా ఉంటుంది మరి...! 

Mahesh Babu Fans Angry on Comedian Manoj Prabhakar:

Manoj Prabhakar sensational comments on super star Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs