Advertisement
Google Ads BL

మహేష్‌‌ను అవమానించి.. సారీ చెబుతున్నాడు


నిన్న సోషల్ అండ్ వెబ్ మీడియాలో ఒకటే న్యూస్ ట్రెండింగ్ లో ఉంది. అది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఒక కోలీవుడ్ కమెడియన్.. మహేశ్ కి యాక్టింగ్ రాదంటూ.. ఒక కామెడీ కార్యక్రమంలో చెప్పి వెకిలిగా నవ్వేయడం... కమెడియన్ మనోజ్.. మహేశ్ బాబు మీద చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు టాప్ ట్రెండింగ్ లోకి రావడం జరిగిపోయాయి. కమెడియన్ మనోజ్ ఆ కామెడీ ప్రోగ్రాం లో వేసిన ప్రశ్నలకు సమాధానంగా.. ఇలాంటి వెకిలి జవాబులిచ్చాడు. ఇంతకీ కమెడియన్ మనోజ్ ని అడిగిన ప్రశ్నలేమిటంటే... 

Advertisement
CJ Advs

మ‌హేశ్‌ను రాక్‌స్టార్ ఎందుకు అంటారు.? అని అడగగానే... మనోజ్.. అత‌డి ముఖం రాయిలా వుంటుంది కాబ‌ట్టి, మ‌హేశ్ బాబు మ‌గ కత్రినా కైఫ్‌లా వుంటాడు, స్పైడ‌ర్‌లో విల‌న్‌గా న‌టించిన ఎస్‌జే సూర్య ఎక్స్‌ప్రెష‌న్లు ఇస్తుంటే.. మ‌హేశ్ రాయిలా వున్నాడు.. అంటూ మనోజ్ చేసిన వెకిలి చేష్టలకి మహేష్ అభిమానులు మనోజ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కేవలం మహేష్ అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా మనోజ్ చేసిన ఈ వెకిలి వ్యాఖ్యలకు మనోజ్ దొరికితే తన్నేలా విరుచుకుపడుతున్నారు. మరి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజున్న హీరోని ఒక కమెడియన్ ఇలా అనడం ఎవరు తట్టుకుంటారు చెప్పండి. అయితే నెటిజెన్లు, మహేశ్ ఫ్యాన్స్ తిట్ల దండకానికి మనోజ్ ప్రభాకర్ దిగి రాక తప్పలేదు. మహేశ్ మీద తానూ చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పడమే కాదు.. వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

ఇంతకీ మనోజ్ ప్రభాకర్ ఎలా సారీ చెప్పాడంటే.. సోషల్ మీడియా సాక్షిగా.. తెలుగు సినిమా ప్రియులకు, మహేశ్ అభిమానులకు, మ‌హేశ్‌బాబు కి కూడా,… ఇంతకు ముందు చెప్పినట్టు వ్యక్తిగతంగా నేను మహేశ్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయంలో నేను ఎవరినైనా బాధిస్తే.. ఎవరి మనోభావాలనైనా బాధపెట్టి ఉంటే.. క్షమించండి. నేను ఇలా కావాలని చెయ్యలేదు. సిన్సియ‌ర్‌గా సారీ చెబుతున్నా. ఇక్కడితో అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా.. అంటూ సోషల్ మీడియా సాక్షిగా మహేశ్ ని మహేశ్ అభిమానులను మనోజ్ ప్రభాకర్ వేడుకున్నాడు.

Comedian Manoj Prabhakar says sorry to Mahesh and His fans:

Manoj Prabhakar Apologizes to Mahesh Babu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs