Advertisement
Google Ads BL

అను ఇమ్మానుయేల్ ఇంక సర్దుకోవడమేనా?


నేచురల్ స్టార్ నానితో కలిసి మజ్ను మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ ప్రస్తుతం అతలాకుతలం అన్న పదానికి దగ్గరగా వుంది. మజ్ను, ఆక్సీజన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ఇలా ఏ సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కి సూపర్ హిట్ ఇచ్చిన పాపాన పోలేదు. పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్ కూడా అను ఇమ్మాన్యుయేల్ లక్కుని మార్చలేకపోయారు. అమ్మడుకి అందం, ఆకర్షణ, నటన అన్ని ఉన్నా లక్కే లేదు. ఇక తాజాగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా నిన్న గురువారం వినాయకచవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పబ్లిక్ టాక్ ఎలా వుంది అంటే సో సో గానే అంటే యావరేజ్ టాకే శైలజ రెడ్డి అల్లుడుకి పడింది.

Advertisement
CJ Advs

మరి నాగ చైతన్యతో అయినా లక్కు మారుతుంది అనుకున్న అనుకి మళ్ళీ నిరాశే ఎదురైంది. మారుతీ దర్శకత్వంలో  తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ అందంగా గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యుయేల్ పొగరు నిండిన అమ్మాయిగా బాగా నప్పింది. యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనవసరం. ఈగో బాగా తలకెక్కిన అను రెడ్డి పాత్రలో బాగానే మెప్పించింది. తల్లితో పోటీ పడి మరీ ఈగో ని ఎక్ష్ప్రెస్స్ చేసిన అను ఈ సినిమాలో నటన పరంగా కూడా బాగా చేసింది. చక్కటి చీర కట్టుతో.... గ్లామర్ తక్కువున్నా డ్రెస్సులంటే చుడి దార్లులలోను అలాగే... నాగ చైతన్య తో రొమాంటిక్ సీన్స్ లో కానివ్వండి అను ఇమ్మాన్యుయేల్ చక్కటి నటన ప్రదర్శించింది. 

ఇక చైతుతో ఏకంగా లిప్ లోక్ కూడా పెట్టేసిన అనుకి ఈ సినిమాతో పెద్దగా ఒరిగేదేమి కనబడడం లేదు. ఎందుకంటే మారుతీ ఈ సినిమాని హ్యాండిల్ చెయ్యడంలో తడబడడం వలన సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిందంటున్నారు. గత చిత్రాల్లో మారుతీ పండించిన కామెడీ శైలజా రెడ్డి అల్లుడు లో మిస్ కావడం వలన సినిమా యావరేజ్ కి పడిపోయిందనే టాక్ నడుస్తుంది. మరి ఈ చిత్రం హిట్ అయితే అనుకి మంచి అవకాశాలొచ్చేయే... కానీ సినిమాకి యావరేజ్ టాక్ రావడం అను కెరీర్ కి కాస్త అవరోధంగానే మారిందని చెప్పాలి.

Anu Emmanuel bad Luck Continues:

Anu Emmanuel Disappoint with Shailaja Reddy Alludu Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs