Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఓవర్సీస్ క్రేజ్ చూశారా!


బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్ర దారిగా అచ్చం ఎన్టీఆర్ లుక్ లోనే దర్శనమిస్తుంటే.. తాజాగా ఆ సినిమాలో మరో కీ రోల్ చంద్రబాబు పాత్రధారి రానా లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రానా అచ్చం చంద్రబాబు పోలికలతో ఇరగదీస్తున్నాడు. మొన్న బాలకృష్ణ తండ్రిగా మెప్పిస్తే, ఇప్పుడు బాబు లుక్ లో రానా అదరగొట్టేస్తున్నాడు. దీన్నిబట్టే దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పాత్రలను ఎంతగా తీర్చిద్దుతున్నాడో అనేది తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మీద కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే భారీ అంచనాలు లేవు... అన్ని చోట్ల అంటే ఇంక్లూడింగ్ ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ బయోపిక్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement
CJ Advs

అందుకే ఎన్టీఆర్ బయోపిక్ కి ఓవర్సీస్ లో ఎలాంటి క్రేజుందో.. అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ కి పలుకుతున్న ధరను బట్టి చూస్తే అర్ధమవుతుంది. గతంలో బాలయ్య బాబు సినిమాలకు ఎన్నడూ ఓవర్సీస్ లో ఎన్టీఆర్ బయోపిక్ కున్న క్రేజ్ లేదు. అందుకే అక్కడ ఆ సినిమాలకు పెద్దగా ధర పలికేది కాదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ మీదున్న అంచనాలతో ఓవర్సీస్ లో ఇప్పుడు దాదాపుగా 20 కోట్ల ఆఫర్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం వచ్చినట్టుగా సమాచారం. మరి ఇలాంటి ఆఫర్ ఎన్నడూ బాలకృష్ణ గత సినిమాలకు రాలేదంటే ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు క్రేజ్ ఏ లెవల్ ఉన్నాయో అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమనే సంకేతాలు వినవస్తున్నాయి.

ఈ వయసులోనూ వరుస సినిమాలతో చెలరేగిపోతున్న బాలకృష్ణకు ఎన్టీఆర్ బయోపిక్ భారీ బ్రేక్ ఇస్తుందని.. ఈ సినిమాతో బాలయ్య నిర్మాతగా బోలెడంత వెనకేసుకోవచ్చని.. బాలకృష్ణ కెరీర్ లోనే ఎన్టీఆర్ బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, విద్య బలం, సీనియర్ నరేష్, మోహన్ బాబు ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ సినిమాలో భాగస్వాములు అవుతున్నారు. మరి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మాత్రం బోలెడంత ఆసక్తి ఉంది.

NTR Sensational Business in Overseas:

NTR Biopic Movie Oversees Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs