ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫీచర్ ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తమ ఇష్టాయిష్టాలను, కెరీర్‌కి, జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఇది ప్రేక్షకులకు తెలియజేస్తోంది. ఇటీవల బోనీకపూర్ మొదటి భార్య మోనాల్ కపూర్ కుమార్తె అన్షుల్లాపూర్ దీనిని వాడారు. దీని ద్వారా ఆమె నుంచి పలు విషయాలను అభిమానులు బయటకు చెప్పించారు. మీ నలుగురు తోబుట్టువుల్లో బోనీకపూర్‌కి బాగా ఇష్టమైంది ఎవరు? అనే ప్రశ్నను ఓ అభిమాని సంధించాడు. దీనికి అందరు తనకు ఒక్కగానొక్క వారసుడైన అర్జున్‌కపూర్ లేదా శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వీ కపూర్‌ల పేరు బయటికి వస్తుందని అందరు ఊహించారు.
కానీ అన్షుల్లా మాత్రం అందరికీ షాక్‌నిస్తూ శ్రీదేవి చిన్నకుట్టి ఖుషీ అంటేనే బోనీకపూర్‌కి ఎక్కువ ఇష్టమని తెలపడం విశేషం. బోనీకపూర్ మొదటి భార్య మోనాల్ కపూర్‌కి అర్జున్ కపూర్, అన్షుల్లా పూర్‌లు సంతానం కాగా, బోనీ రెండో భార్య అతిలోక సుందరి శ్రీదేవికి పుట్టిన వారు జాన్వీకపూర్, ఖుషీ కపూర్‌లు. బోనీకపూర్ మొదటి భార్య మోనాకపూర్ 2012లో క్యాన్సర్‌తో మరణించగా, రెండో భార్య శ్రీదేవి దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించింది. ఇక బోనీకపూర్‌కి తన చిట్ట చివరి కూతురు ఖుషీ అంటేనే ఇష్టమని గతంలో శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఖుషీ బోనీకపూర్‌కి బాగా క్లోజ్ అని, జాన్వీకపూర్ మాత్రం తనపై ఎక్కువగా ఆధార పడుతుందని శ్రీదేవి చెప్పుకొచ్చింది.
అయితే బోనీ కపూర్ ఎంతో నిజాయితీగా అందరినీ ప్రేమతో చూసుకుంటాడని అన్షుల్లా కపూర్ చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ మీ తోబుట్టువుల్లో మీకు నచ్చే అంశాలు ఏమిటి? అని ప్రశ్నిస్తే, వారి హార్ట్, వారి బలం, చీకటి రోజుల్లో కూడా వారు ఎప్పుడు వెలుతురు వైపే చూసే సామర్ధ్యం కలిగి ఉండటం, కారణం లేకుండా వారు నన్ను నవ్వించగలగడం, ఎక్కువగా వారు నా వారు అని చెప్పుకోవడాన్ని ప్రేమిస్తాను అని చెప్పుకొచ్చింది. మరి ఖుషీ హీరోయిన్‌గా ఎప్పుడు పరిచయం అవుతుందో బోనీకపూర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. ఇప్పటికే జాన్వీ 'ధడక్' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.