గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న హవా టాలీవుడ్ లో కొనసాగుతుంది. ‘ఛలో’ వంటి మీడియం రేంజ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన.. ఈ కన్నడ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే ఆ పేరు సంపాదించుకుంది. రెండో సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఆమె ఎంత బిజీ అయిందో అందరికీ తెలిసిందే. రెండు హిట్స్ కొడితే లక్కీ హ్యాండ్ అంటారు. అందుకే ఆమె కోసం నిర్మాతలు, డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం రష్మికకు ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకో సినిమాని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసింది. ‘ఛలో’ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న చిత్రంలో రష్మిక కన్ఫాం అయినట్టే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ తో నితిన్ మార్కెట్ రేంజ్ పెంచుకున్నాడని చాలామంది భావించినా.. అది ఎన్నో రోజులు పట్టలేదు.
వరసగా రెండు సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో నితిన్ రేంజ్ కాస్త తగ్గింది. మరి గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న రష్మిక అయినా నితిన్ కు లక్ తీసుకొస్తుందేమో వేచి చూడాలి. ఈ మూడింటిలో ఏ రెండు సినిమాలన్నా హిట్ అయితే చాలా ఇంక రష్మికకు టాలీవుడ్ లో తిరుగుండదు. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.