సాధారణంగా హిందువులు చవిత రోజు పెద్దగా శుభకార్యాలు చేయరు. కానీ విదేశాలలో పెరిగిన పోర్న్‌స్టార్ సన్నిలియోన్ మాత్రం తనకు ఇలాంటి నియమ నింబంధనలు తెలియవని చెబుతోంది. తాజాగా ఆమె ముంబైలో ఓ ఇంటిని కొని అందులో వినాయక చవితి రోజు తన భర్త వెబర్‌తో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరిచింది.
ఈ సందర్భంగా సన్నిలియోన్ మాట్లాడుతూ, నాకు నియమ నిబంధనలు తెలియవు. ఏరోజు ఏది చేయాలో? చేయకూడదో కూడా తెలియదు. కానీ నేను, వెబర్ ఈ పండుగ నాడు కొత్త ఇంటిలోకి ప్రవేశించడం ద్వారా పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. దేవుడు మీకు సకల శుభాలు కలుగజేయు గాక...అని చెప్పింది. ఇక సన్నిలియోన్ తన 36వ పుట్టినరోజు సందర్భంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే బెవర్లీహిల్స్‌కి సమీపంలో ఆమె దీనిని కొనుగోలు చేశారు. మొత్తం ఐదు బెడ్‌రూంలు, స్విమ్మింగ్‌పూల్, హోమ్‌థియేటర్, గార్డెన్, అవుట్‌డోర్ డైనింగ్ ఏరియా వంటి ఎన్నో సౌకర్యాలు ఆ ఇంటిలో ఉన్నాయి.
ప్రస్తుతం సన్నిలియోన్ బయోపిక్‌గా రూపొందిన 'కరణ్‌జీత్‌కౌర్' వెబ్‌సిరీస్ ప్రసారం అవుతోంది. వీటితో పాటు ఆమె మరో చారిత్రక చిత్రంలో యుద్దనారి పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి సన్నిలియోన్‌కి సెకండ్ హోమ్‌గా ముంబైనే చెప్పాలి.