Advertisement
Google Ads BL

తెలుగింటి అమ్మాయి గుండెనిబ్బరానికి హ్యాట్సాఫ్!


నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరున్న రోహిణి తాజాగా మాట్లాడుతూ, 'గీతాంజలి' చిత్రంలో ఏదో కుర్ర అమ్మాయికి చెప్పినట్లు ఈజీగానే డబ్బింగ్‌ చెప్పేశాను. 'బొంబాయి' చిత్రంలో మనీషా కోయిరాలకి డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టం అనిపించింది. గొంతు మార్చడానికి ఎంతో కష్టపడ్డాను. ముఖ్యంగా బొంబాయి అల్లర్లలో ఇద్దరు పిల్లలను పొగొట్టుకున్న తల్లిగా ఆ బాధను గొంతులో పలికించేందుకు ఎంతో శ్రమించాను. ఇక 'రావన్‌' చిత్రంలో విక్రమ్‌ చనిపోయేటప్పుడు ఐశ్వర్యారాయ్‌ బిగ్గరగా ఏడ్చే సీన్‌ నాకు సవాల్‌గా అనిపించింది. బొంగురు పోయిన ఆ గొంతుని నార్మల్‌లోకి తేవడానికి డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సివచ్చింది. తెలుగు, తమిళంలో డబ్బింగ్‌ చెబుతూనే, మలయాళంలో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చాను. మలయాళ దర్శకుడు సేతుమాధవన్‌ అప్పుడు తెలుగులో 'స్త్రీ' చిత్రం తీశాడు. అందులోని నా నటనకు జాతీయ అవార్డుల జ్యూరీ ప్రశంసలు లభించాయి. తెలుగులో నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో 'తొట్టా చినుంగి' చిత్రం చేశాను. అందులో కూడా రఘువరన్‌ నటించాడు. ఇదివరకే పరిచయం ఉన్నా, ఆ సినిమా షూటింగ్‌లో ఆత్మీయంగా మాట్లాడుకోవడం ప్రారంభించాను. అది ప్రేమగా మారి కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. 

Advertisement
CJ Advs

ఆయన వద్దనడంతో సినిమాలకు దూరం అయ్యాను. ఈలోపు బాబు పుట్టాడు. క్రమంగా మామధ్య స్పర్దలు పెరిగాయి. పోట్లాడుకుంటూ ఒకే చోట ఉండే కంటే విడిపోయి స్నేహితుల్లా ఉండాలనుకున్నాం. విడాకులు తీసుకున్నాం. బాబు నాతోనే ఉండిపోయాడు. వాడి చుట్టూనే నా ప్రపంచాన్ని అల్లుకున్నాను. నేను పెద్దగా ఉద్వేగాలకు గురయ్యే వ్యక్తిని కాను. ఉద్వేగాలు వచ్చినా బయటకు చూపించను. కానీ అమ్మ ఉండి ఉంటే బాగుండేది కదా... అని ఎన్నోసార్లు బాధవేసేది. నాకు రజస్వల, పెళ్లి, తల్లి అయినప్పుడు తోడెవ్వరూ లేక ఒంటరిగా ఉన్నప్పుడు మావాడు ఎదుగుతున్నప్పుడు అమ్మలేని వెలితి బాగా తెలిసింది. అమ్మ పోయాక నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్నితో నాకేమీ ఇబ్బందు లేకపోయినా తల్లిలేని లోటు అతి పెద్దది కదా..! అయినా జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురుకాకుండా ఉండి ఉంటే నేను ఈరోజు మానసికంగా ఇంత బలంగా ఉండే దాన్ని కాదని మాత్రం చెప్పవచ్చు. నా భర్త రఘువరన్‌ నటనని అందరు ఎలా మెచ్చుకునే వారో ఆయనకి అర్ధమయ్యేది కాదు. ఆ..మనల్నెవరు పెద్దగా పట్టించుకుంటారులే అనేవాడు. 

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన నటన గురించి ఎంతో గొప్పగా రాస్తున్నారు. ఫలానా సీన్‌లో ఏమి చేశాడ్రా అంటున్నారు. అవ్వన్నీ చూడకుండా ఆయన అంత చిన్నవయసులోనే మరణించాల్సింది కాదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే రఘు మంచి సంగీతకారుడు, గాయకుడూ. దానిపైన కూడా దృష్టి పెట్టమంటే.. నీలా నేను మల్టీటాస్కింగ్‌ చేయలేను. నటనలో ఉంటూ మిగిలిన వాటిపై దృష్టి పెట్టలేను. అనేవాడు. కానీ చనిపోవడానికి ముందు కొన్ని పాటలు పాడి వీడియో తీశాడు. వాటిని నేను సేకరించి వీడియో ఆల్బమ్‌గా విడుదల చేశాను. దాన్ని రజనీకాంత్‌ ఆవిష్కరించారు. దాని కోసమే మావాడు మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చాడు. వాడిప్పుడు అమెరికాలో ప్రీ-మెడ్‌ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు... అని చెప్పుకొచ్చింది.

Hats-off to Actress Rohini:

Rohini Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs