నిన్న గురువారం టాలీవుడ్ లో భార్యాభర్తల పోరు జరిగింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య - సమంత తమ తమ సినిమాల్తో ఒకరికొకరు పోటీ పడ్డారు. ఎవరి సినిమా మీద నమ్మకంతో వారు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతీ దర్శకత్వంలో అను ఇమ్మాన్యుయేల్ తో కలిసి నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడిగా వస్తే... ఎప్పుడు గ్లామర్ పాత్రలకే ప్రాముఖ్యం ఇచ్చే సమంత లేడి ఓరియెంటెడ్ అండ్ సస్పెన్సు థిల్లర్ యూ- టర్న్ తో వచ్చింది. ముగ్గురు ఈగోయిస్టుల మధ్య పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న యువకుడిలా శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్య నటన పరంగా ఇరగదీసాడు. గెడ్డం పెంచి కాస్త రఫ్ లుక్ లో నాగ చైతన్య బాగానే ఆకట్టుకున్నాడు. కానీ మారుతీ కామెడీ టైమింగ్ సినిమా కి మెయిన్ వీక్ కాగా... సినిమాలో కేరెక్టరైజేషన్ తీరు కూడా పర్ఫెక్ట్ గా మారుతీ చేయలేకపోవడం... మ్యూజిక్ వీక్ గా ఉండడం.. ఎడిటింగ్ లో షార్ప్ నెస్ లేకపోవడంతో.. టోటల్ గా శైలజా రెడ్డి అల్లుడు సినిమా కి యావరేజ్ టాక్ పడింది. ప్రేక్షకులు క్రిటిక్స్ కూడా శైలజా రెడ్డికి సేమ్ మార్కులే వేశారు. రమ్యకృష్ణ వంటి నటి ఉన్నప్పటికీ సినిమాకి యావరేజే పడింది.
ఇక సమంత మెయిన్ లీడ్ లో అది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా భూమిక కీలక పాత్రలో నటించిన యూ- టర్న్ సినిమాకి మాత్రం మంచి హిట్ టాక్ వచ్చింది. సస్పెన్సు థ్రిల్లర్ గా అయితే ఒక వర్గం ప్రేక్షకులను యూ- టర్న్ ఆకట్టుకుంటుందంటున్నారు. ఇక ఈ సినిమాకి మెయిన్ బలం సమంత యాక్టింగ్. సమంత తన నటనతో సినిమా స్థాయిని పెంచేసింది. ఫేస్ ఎక్సప్రెషన్స్ తోనూ, ఎమోషనల్ సీన్స్ లోను, బాడీ లాంగ్వేజ్ లోను సమంత అద్భుతంగా ఆకట్టుకుంది. సినిమా మొత్తాన్ని సమంత భుజాల మీద మోసింది అనడం లో సందేహమే లేదు. ఇక ఆది పినిశెట్టి కూడా బాగానే నటించి మెప్పించగా.. మెయిన్ గా భూమిక ఈ సినిమాకి సమంత తర్వాత ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దర్శకుడు పవన్ కుమార్ కన్నడ యూటర్న్ ని తెలుగులో యాజిటీజ్ గా దింపెయ్యడం.. కథనంలో పట్టులేకపోవడం, ఎడిటింగ్ లో ఉన్న సమస్యల్తో.. యూ- టర్న్ సినిమాకి చిన్న మైనస్ పాయింట్స్ పడ్డాయి. కానీ శైలజా రెడ్డి అల్లుడు కన్నా యూ- టర్న్ కి హిట్ అనే టాక్ అయితే ప్రేక్షకుల నుండి వినబడుతుంది. మరి పట్టుదలగా భార్య భర్తలిద్దరూ ఒకరిమీద ఒకరు పోటీకి దిగి అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ కలిగించారు. మరి ఈ రసవత్తర పోరులో భర్త నాగ చైతన్య కన్నా... భార్య సమంత నే పైచేయి సాధించిందని చెప్పాలి.