ఇటీవల సురేష్‌ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు మాట్లాడుతూ, నేను ఇటీవలే 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న షూటింగ్ సెట్స్‌కి వెళ్లాను. అక్కడ నాకు రానా కనిపించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపించాడు. రానా, చంద్రబాబులా కనిపిస్తూ ఉండటం చూస్తే ఆశ్చర్యం వేసింది. రానా, చంద్రబాబు నాయుడిలా స్టిల్స్ ఇస్తుంటే ఆయనే నా ఎదుట ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాదు.. రానా అని చెప్పకపోతే గానీ నమ్మలేం.. అంటూ తెలిపాడు. దీంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక విషయానికి వస్తే వినాయకచవితి కానుకగా ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడుగా నటిస్తున్న రానా లుక్‌ని యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ జీవితంలో ఆయన అల్లుడు, నేటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఎంతో ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు గతంలో రానాతో 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రాన్ని తీసిన క్రిష్ ఆయన్నే ఎంచుకున్నాడు. ఇటీవల రానాపై పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో నాడు చంద్రబాబు నాయుడు ఎలా ఉండేవాడో రానా కూడా అచ్చు అలానే ఉన్నాడు. ఈ విషయంలో చంద్రబాబు పోలికలకు దగ్గరగా రానాని తీసుకుని రావడంలో క్రిష్ విజయం సాధించాడు.
ఒక రకంగా ఈ పాత్ర రానా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదేనని చెప్పాలి. బసవతారకంగా విద్యాబాలన్, ఎస్వీరంగారావుగా నాగబాబు, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌సింగ్ వంటి వారు ఇందులో నటిస్తున్నారు. హరికృష్ణ పాత్రకు నందమూరి కళ్యాణ్‌రామ్‌ని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏయన్నార్, జయప్రద పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.