Advertisement
Google Ads BL

‘వీరరాఘవ’ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఇది..!


ప్రాణానికి సమానమైన తండ్రి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబసభ్యుల్లో, అభిమానుల్లో, మరీ ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లలో ఆ బాధ ఇంకా పోలేదు. దాంతో వారు నటించే చిత్రాలు కాస్త ఆలస్యం కావడం ఖాయమని పలువురు భావించారు. కానీ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు ఇద్దరు నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో వారి సినిమా షూటింగ్‌లలో హాజరవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలోని ఓ పాటను తాజాగా చిత్రీకరించారు. 

Advertisement
CJ Advs

దీనిపై తమన్‌ స్పందిస్తూ, ఎంతో ఎమోషనల్‌గా ఉన్న తారక్‌ అన్న ఓ సాంగ్‌ చేశాడు. తన డ్యాన్స్‌తో మరలా పాత ఎనర్జీని తెచ్చుకున్నట్లు అనిపించింది. తారక్‌ అన్నను మరలా ఇలా చూడటం ఎంతో హ్యాపీగా ఉంది. 'అరవిందసమేత' టీం తరపున తారక్‌కి 'లాట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌' అని చెప్పాడు. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకను జరపకపోవచ్చని, హరికృష్ణ హఠాన్మరణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ చిత్రం నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని బేనర్‌ చేసిన ఓ ట్వీట్‌లో ఈనెల 20వ తేదీన ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ అద్భుతమైన స్టిల్‌ అంటూ ఆడియో రిలీజ్‌ డేట్‌ని పేర్కొంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఇంతకాలం ప్రమోషన్స్‌పై పెద్దగా శ్రద్దచూపని యూనిట్‌ ఈ వారం నుంచి దాని వేగాన్ని పదింతలు చేయనుంది. 

ఇంకా ఈ చిత్ర యూనిట్‌ ఈ వారంలో పలు అప్‌డేట్స్‌ని ఇవ్వడానికి రెడీ అవుతున్నాం అని చెప్పడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మొదట ఈ చిత్రం ఆడియో వేడుక జరగదని భావించారు. ఆ తర్వాత ఈ వేడుకకు బాలయ్యగానీ, మహేష్‌గానీ అతిధులుగా వస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా మాత్రం ఈ చిత్రంలో అమితాబ్‌ ఓ చిన్నవేషం వేశాడని, ఈ ఆడియో వేడుకకు ఆయనే ముఖ్య అతిధి అని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో ఈనెల 20న తేలనుంది. కాగా ఈచిత్రం వచ్చే నెల విజయదశమి కానుకగా అక్టోబర్‌ 11న విడుదలకు సిద్దమవుతోంది. 

Chavithi Special: Aravinda Audio Poster:

Aravinda Sametha Audio Release Date Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs