Advertisement
Google Ads BL

యువసామ్రాట్ బిరుదు నాకు భారం: చైతూ


 

Advertisement
CJ Advs

మారుతి గారితో 'యువసమ్రాట్‌' అనే బిరుదు వద్దని చెప్పాను. కానీ ఆయన వినలేదు. ఈ ట్యాగ్‌ని ఎంతో బాధ్యతగా ఫీలవుతున్నాను. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చదువుతూ ఉంటాను. నెగటివ్‌ కామెంట్స్‌ని కూడా పాజిటివ్‌గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వారు అలా స్పందిస్తున్నారని భావిస్తూ ఉంటాను అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ, 'సవ్యసాచి' చిత్రంలో ఒక సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. నవంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. శివనిర్వాణ దర్శకత్వంలో నేను, సమంత నటించే చిత్రం అక్టోబర్‌6న వెంకటేష్‌ మామయ్యతో చేయబోయే 'వెంకీ మామ' చిత్రం అక్టోబర్‌ చివరలో ప్రారంభం అవుతాయి. ఇక రాహుల్‌ రవీంద్రన్‌ నాన్న నాగార్జున కోసం ఓ సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాడు. 'బంగార్రాజు' చిత్రంలో మా నాన్నతో కలిసి నేను నటించాలా, అఖిల్‌ నటిస్తాడా? అనేది తేలాల్సివుంది. డిజిటల్‌ మీడియా వైపు మా బేనర్‌ ఫోకస్‌ పెట్టింది. పలు వెబ్‌సిరీస్‌లు ప్లాన్‌ చేస్తున్నాం. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడం నాకు కూడా ఇష్టమే. ఇప్పటికే ఆ విధంగా కొన్ని చిత్రాలు కూడా చేశాను. కొన్ని వర్కౌట్‌ కాలేదు. అయితే వేరొకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్‌ కూడా తప్పయి ఉండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటిలో 'ప్రేమమ్‌' చిత్రం నాకు బాగా కనెక్ట్‌ అయింది. పెళ్లి తర్వాత లైఫ్‌ బాగుంది. పెళ్లి తర్వాత సమంత కెరీర్‌ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. 

కానీ ఆమె కెరర్‌ సూపర్‌గా కొనసాగడం ఎంతో ఆనందంగా ఉంది. కెరీర పరంగా యాక్టర్స్‌ అందరికీ ఓ థ్రెట్‌ ఉంటుంది. అందరు మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తాయి. 'అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100' చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేను ఆటైప్‌ క్యారెక్టర్స్‌ చేయాలంటే ఇంకా కాస్త సమయం పడుతుంది? అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. 

Chaitu Reaction on Yuva Samrat Tag:

Naga Chaitanya latest Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs