Advertisement
Google Ads BL

‘2.ఓ’ టీజర్: దీన్ని ఎవరైనా టీజరంటారా?


శంకర్ - సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన 2.ఓ సినిమా గురించిన అప్ డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులే కాదు.. సినిమా ప్రియులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి సౌత్ లోనే అదరగొట్టే బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ వినాయకచవితి శుభాకాంక్షలతో 2.ఓ టీజర్ ని విడుదల చేశారు.. అది కూడా త్రీ డి లో. ఇండియా వైడ్ గా దాదాపుగా 1000 కి పైగా థియేటర్స్ లో 2.ఓ టీజర్ ని విడుదల చేసిన 2.ఓ టీం.. అదే టైం లో యూట్యూబ్ లోను విడుదల చేసింది. గ్రాఫిక్స్ పనుల వలన 2.ఓ విడుదల లెట్ అవుతుందని దర్శకుడు శంకర్ చెబితే ఏమో అనుకున్నారు కానీ 2.ఓ టీజర్ చూసాక శంకర్ చెప్పినది అక్షరాలా నిజమనిపిస్తుంది. అంతలా 2.ఓ ఉందంటే నమ్మాలి మరి.

Advertisement
CJ Advs

లైకా ప్రొడక్షన్ లో మితిమీరిన బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.ఓ మీద భారీ అంచనాలున్నాయి. నిజంగా అంత పెట్టుబడి లైకా వారు ఎందుకు పెట్టారు... అనేది ఈ టీజర్ లో స్పష్టంగా తెలుస్తుంది. రజినీకాంత్ - అమీ జాక్సన్ జంటగా అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కిన 2.ఓ టీజర్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ప్రపంచాన్ని శాసించాలని.. అందరిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఎదురు చూసే విలన్ అక్షయ్ కుమార్ మనిషి రూపంలో కాకుండా ఒక పక్షి రూపంలో వచ్చి శాటిలైట్ సిగ్నల్  వ్యవస్థను తన నియంత్రణలోకి తీసుకోవడమే కాక... ప్రతి ఒక్కరి సెల్ల్ ఫోన్‌ని మాయం చేస్తుంటాడు. చేతిలో ఫోన్ చేతిలోనే కోట్లలో మాయమైపోతుంటే.... ఇది ముప్పుగా పరిణమించబడటంతో హీరో రజినీకాంత్ దీనిని ఆపాలంటే.. చిట్టి ని మళ్ళి తయారు చేయాలని చెబుతాడు. మరి రజిని తయారు చేసి ప్రవేశపెట్టే చిట్టి అక్షయ్ కుమర్ కి ఎలా అడ్డుకట్ట వేసింది... అలాగే వారి మధ్య జరిగే పోరాటమే 2.ఓ కథగా తెలుస్తుంది.

హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా  2.ఓ నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో  2.ఓ రూపుదిద్దుకుంది. శంకర్ ఎక్కడా గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకపోబట్టే.. ఈ సినిమా విడుదలకు ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది. మరి శంకర్ ఇంత అద్భుతంగా గ్రాఫిక్స్ వర్క్ కోసమే టైం స్పెండ్ చెయ్యడం నిజంగా అద్భుతమని చెప్పాలి. క్లైమాక్స్ లో వచ్చే స్టేడియం ఫైట్ సినిమాకే హైలెట్ అని చెబుతూ వచ్చారు.. నిజంగానే అది నిజం అనేలా ఉంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇక ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం, శంకర్ దర్శకత్వం అని సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక ప్రస్తుతం టీజర్ తో దుమ్మురేపిన  2.ఓ సినిమా నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.

2.0 Teaser Released:

2.0 Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs