Advertisement
Google Ads BL

‘సిల్లీ ఫెలోస్’.. నిరాశ తప్పలేదు..!!


ఒక్కప్పుడు సునీల్ కి అల్లరి నరేష్ కి బాగా కలిసొచ్చేది. అల్లరి నరేష్ హీరోగా చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ అయ్యాయి. అలానే సునీల్ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన టైములో వరస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత అంటే నాలుగైదేళ్లుగా వీరిద్దరికి అస్సలు కలిసి రావడం లేదు.  ఇక నరేష్..సునీల్ ఇద్దరు కలిసి నటించిన ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇది సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. ఓ తమిళ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తీశారు. అయితే అది అక్కడ హిట్ అయింది. కానీ ఇక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. స్టోరీ చాలా రెగ్యులర్ అవ్వడం దానికితోడు ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం ఆ సినిమాకి డిజాస్టర్ అవ్వడానికి కారణం అయ్యాయి.

Advertisement
CJ Advs

మొదటి రోజు నుండే నెగటివ్ తో రన్ అయినా ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదే విధంగా వచ్చాయి. దాంతో ఈ సినిమా ఇంకా పుంజుకోవడం కష్టం అయింది. అవుట్ డేటెడ్ కామెడీ.. డైరెక్షన్ చాలా వీక్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈసినిమాపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. దాంతో వీరిద్దరి ఖాతాలో మరో ఫ్లాప్‌ జమ అయింది. నిజానికి ఈచిత్రంలో సునీల్ హీరో కాదు. కొంచం హీరోకి కమెడియన్ కి మధ్య ఉండే పాత్ర చేశాడు. హీరోగా సినిమాలు మానేసి కమెడియన్‌గా సెటిలై పోవాలనుకుంటున్న సునీల్‌‌కు స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బ తగిలింది.

మరి సునీల్ కమెడియన్ గా రెండో ఇన్నింగ్స్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక అల్లరి నరేష్ కూడా సునీల్ లా హీరో పాత్రలకు బాయ్ చెప్పేసి సహాయ పాత్ర చేయడం మంచిది అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం నరేష్ ‘మహర్షి’ సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెట్స్ మీద ఉన్న ఈసినిమాలో నరేష్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ‘గమ్యం’ లో అతను చేసిన పాత్రలా ఉంటదని టాక్ వస్తుంది. చూద్దాం మరి ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అవుతాడో..?

Silly Fellows Disappointed with Movie Result:

Sunil and Allari Naresh Not Success with Silly Fellows
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs