Advertisement
Google Ads BL

రష్మిక ఎంగేజ్‌మెంట్ రద్దు- ఏది నిజం?


ప్రస్తుతం టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదన్న ఉంది అంటే అది కన్నడ భామ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అనే విషయమే. రష్మిక సినిమాల్లోకి వచ్చిందో లేదో... సహా నటుడు రక్షిత్ ని ప్రేమించి మరీ నిశ్చితార్ధం చేసుకుంది. ఇక రక్షిత్ తో రష్మిక నిశ్చితార్ధం జరిగిందో లేదో.. రష్మిక మందన్న అటు కన్నడలో కన్నా ఎక్కువగా తెలుగులో విపరీతమైన బిజీ అయ్యింది. ఛలో హిట్.. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారడంతో.... రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడనే టాక్ గీత గోవిందం హిట్ అయినప్పటి నుండి నడుస్తుంది. తాజాగా ఇంగ్లీష్ డైలీ ఒకటి రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ విషయం ప్రచురించడం.. తరవాత రష్మిక తల్లి రష్మిక - రక్షిత్ ఎంగేజ్మెంట్ రద్దు విషయాన్నీ కన్ఫర్మ్ చెయ్యడం జరిగిపోయాయి. అయితే రష్మిక.. రక్షిత్ తో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకోవడానికి కారణం కెరీర్ లో బిజీ అయ్యి పెళ్లి అయితే అవకాశాలు తగ్గుతాయని ఉద్దేశ్యంతోనే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... రష్మిక ప్రేమించిన రక్షిత్ మాత్రం అస్సలు స్పందించలేదు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా.. రష్మిక మీద జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి రక్షిత్ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. కొన్నాళ్లుగా రక్షిత్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ.... తన సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ మధ్యలో రక్షిత్ తో వచ్చిన విభేదాల కారణంగానూ, కెరీర్ ని దృష్టిలో పెట్టుకున్న రష్మిక, రక్షిత్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందనే న్యూస్ నడుస్తున్న వేళ రక్షిత్ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. .ఈ ఇష్యూలో రష్మికను విలన్ గా చూడొద్దని..  ఎంగేజ్మెంట్ రద్దు కావడంలో రష్మిక తప్పేమి లేదని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరి చేతిలో ఏమి ఉండవని... రక్షిత్, రష్మీకను వెనకేసుకొచ్చాడు.  మీరు చెబుతున్న తప్పుడు అభిప్రాయాలకు కారణం కేవలం ఈ ఇష్యూని ఒకే కోణంలో చూపడం వల్లే అన్న రక్షిత్ దీని గురించి తాను ఎవరిని నిందించనని చెప్పాడు. 

రష్మిక తో తనకి రెండేళ్ల పరిచయం ఉందని... తనకంటే బాగా ఎవరూ రష్మికని అర్థం చేసుకోలేరని రష్మికపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు రక్షిత్. అయితే నిజంగానే రష్మిక, రక్షిత్ ఎంగేజ్మెంట్ రద్దు కావడానికి పరిస్థితులే కారణమా... లేదంటే రష్మిక కొచ్చిన ఫేమ్ కారణమా.. లేదంటే రష్మికకు, రక్షిత్ కి మధ్య వచ్చిన విభేదాలు కారణమా అనేది క్లారిటీ రాలేదు కానీ... ఈ ఇష్యూతో తామెంతో నలిగిపోయామని రష్మిక తల్లి ఓపెన్ అవడం మాత్రం ఇక్కడ కొసమెరుపు.

Rashmika Mandanna Engagement Cancelled:

Rashmika Mandanna Mother About Her Engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs