Advertisement
Google Ads BL

బ్రేకప్ అని హీరోయిన్ తల్లే చెప్పేసింది


సాధారణంగా మీడియాలో వచ్చే వార్తలు 100శాతం నిజమని ఎవ్వరూ అనరు గానీ జర్నలిస్ట్‌లకు ఉప్పదంకుండా ఏదేదో రాస్తారనుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే ఆ వార్తల మీదనే ఆ జర్నలిస్ట్‌ క్రెడిబులిటీ, అతను పనిచేసే సంస్థ విశ్వసనీయత ఆధారపడి ఉంటాయి. వాటిని కావాలని ఎవ్వరూ చెడగొట్టుకోవాలని భావించరు. ఇక విషయానికి వస్తే కన్నడ భామ అయిన రష్మిక మందన్న తన తొలి చిత్రం 'కిర్రాక్‌పార్టీ' ద్వారా కన్నడలో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో నాగశౌర్యతో నటించిన 'ఛలో', ఇటీవల గీతాఆర్ట్స్‌2లో పరుశురాం దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందిన 'గోతగోవిందం'తో తెలుగులో వరుసగా రెండు హిట్స్‌ సాధించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆమె తొలి మూడు చిత్రాలతోనే హ్యాట్రిక్‌ సాధించింది. ముఖ్యంగా 'గీతగోవిందం'తో ఈమెకి స్టార్‌ స్టేటస్‌ వచ్చేసింది. యంగ్‌ స్టార్స్‌ పలువురు ఆమెతో నటించడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు నటించే మల్టీస్టారర్‌కి కూడా ఓ హీరోయిన్‌గా ఈమె పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈమె తన తొలి చిత్రం 'కిర్రాక్‌పార్టీ' సమయంలోనే సహనటుడు, నిర్మాత రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరి నిశ్చితార్ధం కూడా 2017లో బ్రహ్మాండంగా జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా ఈ నిశ్చితార్ధం ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు తెలుగులో అనుష్క శెట్టిలాగా అన్ని తరహా పాత్రలు, లాంగ్‌స్టాండింగ్‌ ఉండాలనే ఆశను వెలిబుచ్చింది. కానీ అది చూసిన పలువురు అవ్వా కావాలి.. బువ్వా కావాలి.. అంటే వీలుకాదు. ఎవరికోగానీ పెళ్లయిన తర్వాత కూడా అదే క్రేజ్‌ కొనసాగదు. ఇప్పటికే పెళ్లికి తొందరపడుతోన్న ఈమె కొంతకాలం మాత్రమే సినిమాలలో రాణించగలదు అని వ్యాఖ్యానించారు. మొత్తానికి కన్నడ నాట నుంచి మరో సౌందర్య, ప్రేమ, అనుష్క తరహాలో ఈ భామ వెలుగులోకి వచ్చింది. 

ఇక ఈమెకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ పెరుగుతోందని, కాబట్టే ఆమె నిశ్చితార్దం క్యాన్సిల్‌ చేసుకుందని ఓ వైపు, 'గీతగోవిందం' సమయంలో విజయ్‌ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ శృతిమించడం ఆమెని చేసుకోబోయే భర్తకి నచ్చలేదని పలు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ నిశ్చితార్ధం క్యాన్సిల్‌ అయిందని ఆమె తల్లి సుమన్‌ తేల్చిచెప్పింది. నా కుమార్తె నిశ్చితార్ధం రద్దయింది. ఇరు కుటుంబాల మధ్య ఎప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు. మేమంతా బాగా డిస్ట్రర్బ్‌ అయ్యాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి జీవితం ఎంతో ముఖ్యం. ఎదుటి వ్యక్తిని బాధపెట్టడం ఎవరికీ ఇష్టం ఉండదు అని తెలిపింది. టాలీవుడ్‌లో సక్సెస్‌ కావడం, వరుస అవకాశాలు రావడమే వీరి నిశ్చితార్ధం రద్దు కావడానికి కారణంగా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె నాగార్జున, నాని నటిస్తున్న 'దేవదాసు' చిత్రంలో నానికి జోడీగా నటిస్తోంది. 

Rashmika-Rakshit Break-Up: Mother Suman Reveals The Reason:

Mom Reacts To Daughter’s Break Up  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs