Advertisement
Google Ads BL

దర్శకుడి చెత్త వాగుడు.. కౌంటరేసిన నటి


నటి స్వరాభాస్కర్‌ తన చిత్రాలలోనే కాదు.. నిజజీవితంలో కూడా ఎంతో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా ఉంటుంది. ఈమెపై ఓ దర్శకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో మైక్రో బ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ ఆయనకు షాకిచ్చింది. ఇక విషయానికి వెళ్తే, జలంధర్‌ చర్చికి చెందిన ఓ బిషప్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇటీవల కేరళకి చెందిన ఓ సన్యాసిని పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేరళ ఎమ్మెల్యే జార్జి మాట్లాడుతూ, ఇన్నిరోజులు ఎంజాయ్‌ చేసి ఇప్పుడు రేప్‌ అంటావా? తొలుతే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ఆ సన్యాసినిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీనిపై బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరాభాస్కర్‌ తీవ్రంగా స్పందించింది. 'ఎమ్మెల్యే అలా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఆయన మాటలు రోత పుట్టించేలా ఉన్నాయి. ఇలాంటి చెత్తే ప్రస్తుతం దేశ రాజకీయాలలో తిరుగుతూ, దేశాన్ని మతం పేరిట విడగొడుతోంది. నిజంగా అతని వ్యాఖ్యలు అసహ్యింగా ఉన్నాయి' అని మండిపడింది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల వరవరరావుతో పాటు సుధా భరద్వాజ్‌ వంటి పలువురు హక్కుల నేతలను మోదీని హత్య చేయడానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'మీ టూ అర్బన్‌ నక్సల్‌' పేరుతో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ నడిచింది. దీనికి స్వరాభాస్కర్‌ సైతం మద్దతు ప్రకటించింది. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి స్వరాభాస్కర్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ, 'మీటూ ప్రాస్టిట్యూట్‌ నన్‌' అని ప్లేకార్డ్‌లు పట్టుకుని ఇంకా ఎవ్వరు ముందుకు రాలేదే? అంటూ చులకన చేసే విధంగా స్పందించాడు. దీంతో వివేక్‌ వ్యాఖ్యలపై స్వరాభాస్కర్‌ ఘాటుగా స్పందించింది. అత్యాచార బాధితుల బాధను తనకి నచ్చనివారిపై దాడి చేసేందుకు ఆయుధంగా వివేక్‌ వాడుకుంటున్నాడని అద్భుతమైన కౌంటర్‌ ఇచ్చింది. వివేక్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై స్వరాభాస్కర్‌ ట్విట్టర్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన ట్విట్టర్‌ యాజమాన్యం వివేక్‌ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని సూచించింది. ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు తమ పాలసీకి వ్యతిరేకమని ట్విట్టర్‌ స్పష్టం చేసింది. 

దీంతో వెంటనే తేరుకున్న వివేక్‌ ఆ అసభ్య వ్యాఖ్యలను తొలగించి మౌనంగా ఉండిపోయాడు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ట్విట్టర్‌ యాజమాన్యానికి స్వరాభాస్కర్‌ కృతజ్ఞతలు తెలిపింది. నిజంగా సెలబ్రిటీలు నిజాయితీగా వ్యవహరిస్తే ఎలాంటి విజయాలు సాధించగలరో ఈ సంఘటన రుజువు చేస్తోంది. సోషల్‌మీడియాను టైంపాస్‌ వ్యవహారంగా కాకుండా మంచి విషయాలకు ఉపయోగిస్తూ తమకున్న సెలబ్రిటీ హోదా పవర్‌తో వివేక్‌ చెత్త వాగుడుకి బుద్ది చెప్పిన స్వరాభాస్కర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దట్స్‌ గ్రేట్‌ స్వరాభాస్కర్‌. ఈమె నిజంగా ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా తనని తాను నిరూపించుకుంది. 

Swara Bhaskar Counter on Director:

Swara Bhaskar Says Thanks to Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs