Advertisement
Google Ads BL

అబ్బో నాగచైతన్యలో ఇంత మెచ్యూరిటీయా?


తెలుగు ఇండస్ట్రీలోని టాప్‌స్టార్స్‌లో మంచి లౌక్యం, ప్రతి విషయాన్ని బిజినెస్‌ మైండ్‌తో, నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా, కర్ర విరగకూడదు... పాము చావకూడదనే విధంగా తనదైన లౌక్యంతో సాగిపోయే స్టార్‌ నాగార్జున. ఈయన ఎవరితో ఏ అవసరం వస్తుందో అన్న తరహాలో ఎంతో స్మూత్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా రాజకీయనాయకుల విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా మాట్లాడుతూ, మార్కులు కొట్టివేయడం నాగార్జునకు కొట్టిన పిండి. అదే ప్రస్తుతం నాగచైతన్యలో కూడా బాగా కనిపిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే నాగచైతన్య హీరోగా రమ్యకృష్ణ అత్తగా, అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ చిత్రం వినాయక చవితి కానుకగా రేపు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని పాటలు, టీజర్లు, ట్రైలర్స్‌కి మంచి స్పందన వస్తోంది. మారుతి స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం విడుదల సందర్భంగా నాగచైతన్య ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ చేశాడు. ఈ సందర్బంగా ఆయన మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి వారి గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. 

ఈ చిత్రంలో తనకు నచ్చిన పాటల గురించి, తాను భవిష్యత్తులో చేయబోయే చిత్రాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. దీనిలో భాగంగా కేటీఆర్‌ గురించి అడగ్గా...ఆయనొక నిజమైన లీడర్‌. ప్రభావితం చేయగల నాయకుడని కితాబునిచ్చాడు. ప్రభాస్‌ గురించి అడిగిన ప్రశ్నకు 'లార్జర్‌ దేన్‌ లైఫ్‌' అని, రామ్‌చరణ్‌ గురించి చెబుతూ, సినిమా సినిమాకి బెటర్‌ అవుతూ ఉంటున్నాడని తనదైనశైలిలో చెప్పుకొచ్చాడు. వెంకటేష్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, మహేష్‌బాబు, నాగార్జునలకి సంబంధించిన పలు ప్రశ్నలను అభిమానులు అడగ్గా ఎంతో లౌక్యంగా సమాధానం ఇచ్చాడు. 

Naga Chaitanya About KTR:

Naga Chaitanya Chit Chat with Fans in twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs