Advertisement
Google Ads BL

ఇద్దరం ప్రొగ్రెస్ రిపోర్ట్స్ కోసం వెయిటింగ్: సమంత!


అనుకోని చిత్రంగా భర్త నాగచైతన్య నటిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు', భార్య సమంత నటించిన 'యూటర్న్‌' చిత్రాలు రెండు రేపే విడుదల కానున్నాయి. ఇలా ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం విధివిచిత్రం అంటున్న సమంత తామిద్దరం ఇంట్లో కూర్చుని విద్యార్ధుల్లా రిపోర్ట్‌ కార్డ్స్‌ కోసం ఎదురుచూస్తామని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఏ చిత్రమైన బాగా ఆడి, నిర్మాతలకు డబ్బులు రావడమే ముఖ్యం. నాకు తెలిసి బాక్సాఫీస్‌ రిజల్టే విజయానికి గీటు రాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంటేనే బిజినెస్‌. మంచి పేరు ఎవరికి కావాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. ఈ విషయంలో నేను ఎవ్వరికీ తాళం వేయను. కన్నడలో 'యూటర్న్‌' చిత్రం చూసిన తర్వాత ఈ చిత్రాన్ని మరింత మందికి చూసేలా చేయాలని అనిపించింది. థ్రిల్లర్‌ చిత్రాలంటే ఓ భాష వారికైనా, ఏ వర్గం ప్రేక్షకులకైనా ఇష్టమే. ఈ చిత్రంలో కథే హీరో. ఆ కథను నడిపించేందుకు మేము కొన్ని పాత్రలు చేశాం. అంతే. ఇందులో భూమిక గారితో కలిసి నటించడం ఎంతో ఆనందం వేసింది. క్లైమాక్స్‌లో ఆమె నటన అద్భుతం. ఈ చిత్రం కోసం నేను హెయిర్‌ కట్‌ చేసుకోవాల్సిరావడం, అందుకు ముందు నాకున్న కొన్ని కమిట్‌మెంట్స్‌ వల్ల లేటయింది. భార్యగా నా భర్త నటించిన చిత్రం విజయం కూడా నాకు ముఖ్యం. 

Advertisement
CJ Advs

'శైలజారెడ్డి అల్లుడు' చూశాను. పండగకి ఫుల్‌మీల్స్‌ వంటి చిత్రం. నా సినిమా వర్క్‌ చెన్నైలో జరుగుతుండటం వల్ల చైతూ 'యూటర్న్‌' ఇంకా చూడలేదు. ఈ ఏడాది నేను తీసుకున్న రిస్క్‌లన్నీ సక్సెస్‌ అయ్యాయి. 'రంగస్థలం, మహానటి, అభిమన్యుడు'వంటి చిత్రాలన్నీ బాగా ఆడాయి. ఈ ఇయర్‌ నాకు బాగా కలిసి వచ్చింది. ఇందులో నాది గ్రామీణ యువతి పాత్ర మాత్రం కాదు. ఈ ఏడాదంతా ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. అలాగే నా వర్క్‌ వెనుక హార్డ్‌వర్క్‌ కూడా ఉంది. తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం కష్టమే. కానీ దానిని కంటిన్యూ చేస్తాను. తమిళంలో కూడా సొంతగానే డబ్బింగ్‌ చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను కంప్లీట్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఈ చిత్రం ప్రమోషనల్‌ సాంగ్‌లో డ్యాన్స్‌ చేసే అవకాశం లభించింది. మా స్కూల్‌ ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి అభినందించారు. ప్రతి సినిమాకి ఇంతకు ముందు చేయని చాలెంజ్‌ని స్వీకరించడానికి ఇష్టపడతాను. నా వర్క్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటాను గానీ సౌకర్యాలు కోరుకోను. 

ప్రస్తుతం నేను ఎంతో సెక్యూర్డ్‌గా ఉన్నాను. సక్సెస్‌ల కోసమే సినిమాలు చేయాలని లేదు. ఎగ్జైటింగ్‌ స్క్రిప్ట్స్‌ని మాత్రం వదులుకోను. పెళ్లి చేసుకున్న తర్వాత స్ట్రాంగ్‌ ఉమెన్‌గా మారాను. మంచి సపోర్ట్‌ ఉంది. పిల్లల కోసం ఇంకా డేట్‌ ఫిక్స్‌ చేసుకోలేదు. దేవుడే ఫిక్స్‌ చేస్తాడు. శివనిర్వాణ దర్శకత్వంలో నేను, చైతు చేసే చిత్రం అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది. అదే రోజు మా పెళ్లిరోజు. ఆ డేట్‌ స్పెషాలిటీ అది. మరో చిత్రం చేయడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ ఆ విషయాలు తర్వాత చెబుతాను అని సమంత చెప్పుకొచ్చింది.

Samantha Latest Interview Updates:

Samantha About U Turn and Shailaja Reddy Alludu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs