Advertisement
Google Ads BL

బిగ్‌బాస్: దీప్తి భర్త దెబ్బకి తనీష్ ఏడ్చేశాడు


బిగ్ బాస్ సీజన్ 2 లో అమ్మ.. అమ్మ అని పిలుస్తూనే టీవీ9 యాంకర్ దీప్తి నల్లమోతుతో టాస్క్‌లలో పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు తనీష్. ప్రస్తుతం ఇతని ప్రవర్తనపై సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రిలేషన్స్ కి వ్యాల్యూ ఇస్తానని అంతే కానీ గేమ్స్ లో అలా ఆడటం తప్పట్లేదని వివరణ ఇచ్చిన అతనిపై కొంతమంది సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

Advertisement
CJ Advs

తనీష్ అంతకుముందు సామ్రాట్‌తో కానీ.. సునయనతో కానీ ఈ విధంగా ఆడలేదు. అయితే దీప్తి దీనిని తనకు అనుకూలంగా వాడుకోలేకపోతుంది. ఎక్కడ నోరెత్తి మాట్లాడితే తనను తనీష్ ఎక్కడ నామినేట్ చేస్తాడో అని భయపడుతుంది. మరి తనీష్ ఏమైనా ఊరికే ఊరుకుంటున్నాడా.. దీప్తిని పదే పదే నామినేట్‌ చేస్తూనే వచ్చాడు. అయితే దీప్తి.. తనీష్ ప్రవర్తనపై స్పదించకపోయేసరికి నిన్న మొన్న నామినేషన్స్ రోజు కౌశల్ గట్టిగ తనీష్ కి క్లాస్ పీకాడు. తను అనుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక నిన్న సామ్రాట్ వాళ్ల అమ్మ వచ్చి అమ్మ గురించి భలే మాట్లాడుతున్నావయ్యా అనడంతో కౌశల్ హీరో అయ్యిపోయాడు. నిన్న దీప్తి వాళ్ల భర్త వెళ్తూ వెళ్తూ తనీష్ కి 'ఫిజికల్‌ టాస్క్‌లు ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి' అని ఒక చురక వేసి పోయాడు. దాంతో తనీష్ కి నిన్న ఒకేసారి అలా అందరి దగ్గర నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో స్మోకింగ్‌ రూమ్‌లో దూరి బాధ పడిపోవడం మొదలు పెట్టాడు. అతన్ని సామ్రాట్ వచ్చి ఓదార్చటం కూడా జరిగింది. మరి ఫైనల్ కూడా ఎంతో దూరం లేదు కొంచం చూసుకుని చాలా జాగ్రత్తగా ఆడితే ఫైనల్ వరకు వెళ్లగలవ్.. లేదంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వక తప్పదు.

Bigg Boss 2: Deepthi Husband Comments On Tanish:

Deepthi Hubby Makes Tanish Cry  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs