Advertisement
Google Ads BL

టెండుల్కరన్, ఛార్మింగ్ గాళ్!.. ఏంటిది శ్రీరెడ్డి?


గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్‌ ఉంది. అయితే అలాంటి పరిస్థితి మాకు మాత్రం ఎదురు కాలేదు. ఓ నిర్మాత, దర్శకుడు అలా చేశారు. ఒక హీరో ఇలా ప్రవర్తించాడు? అని చెప్పడం తప్ప వారి పేర్లు చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో మనం ఉన్నాం. నిజానికి సమస్య ఇండస్ట్రీ వారికే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ ఎవరు ఎలా ప్రవర్తించారు? అనేది మాత్రం అది అనుభవించిన వారికే తెలుసు. అంత మాత్రాన ఓ వ్యక్తి అని చెప్పి ఇండస్ట్రీలోని అందరి మీదా అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడటం సరికాదు. తమ సినిమాలలో ఎవరైనా సమస్యలను ప్రస్తావిస్తారు. కానీ దానికి పరిష్కారం చూపే వారే నిజమైన దర్శకనిర్మాతలు. ఇండస్ట్రీలోనే ఉంటూ అందరిపై అనుమానం వచ్చేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం, వార్తల్లో నిలవాలని కోరుకోవడం సరికాదు. దీని వల్ల మీడియాకు మేత దొరుకుతుందే గానీ అంతకు మించిన ప్రయోజనం ఉండదు. 

Advertisement
CJ Advs

ఇక విషయనికి వస్తే గత కొంతకాలంగా శ్రీరెడ్డి.. ఇండస్ట్రీలో, మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె తన ‘శ్రీలీక్స్‌’ ద్వారా ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పలువురు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మొదట టాలీవుడ్‌తో మొదలుపెట్టిన ఆమె తర్వాత కోలీవుడ్‌ దాకా వెళ్లింది. ఇప్పుడు ఏకంగా క్రికెట్‌ ప్రపంచం దేవుడిలా కొలిచే సచిన్‌పై ఆరోపణలు చేయడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ క్రికెట్‌లోనే దేవుడిలా కొలిచే సచిన్‌ని.. సచిన్ టెండుల్కరన్ అంటూ, టాలీవుడ్‌‌లో ఛార్మింగ్ గాళ్‌గా చెప్పుకునే నటితో సంబంధం ఉందని లింక్‌ పెట్టింది. వీరి మద్య మీడియేటర్‌గా చాముండేశ్వరి స్వామి వ్యవహరించారని సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేసింది. గొప్ప వ్యక్తులు చాలా బాగా ఆడుతారు. అంటే నా ఉద్దేశ్యంలో బాగా రొమాన్స్‌ చేస్తారని అర్ధం.. అంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ హాట్‌గా సోషల్ మీడియాని వేడిక్కిస్తున్నాయి. వీటిని విన్న పలువురు క్రికెటర్లపై అనుమానపడుతూ ఉంటే కొందరు సచిన్‌ టెండూల్కర్‌, చాముండేశ్వరినాథ్‌లే వారు అంటూ బల్లగుద్ది చెబుతున్నారు. ఇలా అందరిపై అనుమానాలు రేకెత్తేలా బిహేవ్‌ చేయడం శ్రీరెడ్డికి సమంజసమా? అనేది అసలు ప్రశ్న.

Sri Reddy Allegations on Cricket God Sachin:

Sri Reddy Target on Cricketers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs