Advertisement
Google Ads BL

సామ్.. చైతూలో.. ఎవరెక్కువ..?


నాగ చైతన్య - సమంత ఐదేళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా సమంత తన కెరీర్ లో దూసుకుపోతుంది. వరుస హిట్స్ తో భీభత్సమైన ఫామ్ లోకొచ్చేసింది. ఇక నాగ చైతన్య మాత్రం పెళ్లి అయ్యాక అతనిది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ సమంత నటించిన మూడు సినిమాలు పెళ్లయ్యాక విడుదల కావడం.. అవి కాస్తా సూపర్ డూపర్ హిట్స్ అవడంతో...సమంత రేంజ్ క్రేజు ఒక్కసారిగా మారిపోయింది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తోనూ, మహానటి వంటి బయోపిక్ లోను, అభిమన్యుడు వంటి సినిమాతోనూ సమంత ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక నాగ చైతన్య నటించిన సినిమాలేవీ పెళ్లి తర్వాత విడుదల కాలేదు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం నాగ చైతన్య మారుతీ దర్శకత్వంలో నటించిన శైలజ రెడ్డి అల్లుడు రేపు గురువారం విడుదల కాబోతుంది. అలాగే సమంత ఇష్టపడి చేసిన యు-టర్న్ కూడా రేపు గురువారం చైతు శైలజ రెడ్డి అల్లుడుతో తలపడబోతుంది. మరి భార్యాభర్తల మధ్య బాక్సాఫీస్ వార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు తెర తీసింది. అయితే సమంత క్రేజుతో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సమంత చేసిన యు - టర్న్ సినిమా మీద కన్నా ప్రేక్షకులకు ఒకింత ఆసక్తి నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు మీదే ఉంది. మహానుభావుడు సినిమా హిట్ తో ఉన్న మారుతీ దర్శకత్వంలో ఈ శైలజ రెడ్డి అల్లుడు తెరకెక్కడం, శివగామి లాంటి పవర్ ఫుల్ అత్తగా రమ్యకృష్ణ  ఈ సినిమాలో నటించడంతో .. శైలజ రెడ్డి అల్లుడు మీద ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

ఇక సమంతకి కూడా ఈ ఏడాది మూడు వరుస హిట్స్ ఉంది. అయితే సమంత చేసిన రీమేక్ మూవీ యు-టర్న్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కావడం.. ఈ సినిమాలో సమంత తప్ప మరే క్రేజీ పాయింట్ లేకపోవడం... అలాగే కామెడీ ఎంటెర్ టైనర్ గా ఉన్న శైలజ రెడ్డి అల్లుడు మీదున్న క్రేజ్ ముందు సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలవగలదో లేదో అనే అనుమానం అయితే ట్రేడ్ లో ఉంది. అయితే సమంత క్రేజ్ మీద నమ్మకంతో యు-టర్న్ సినిమాకి మంచి ఓపెనింగ్ రావడమే కాదు.. శైలజ రెడ్డి అల్లుడుతో పోటీ పడి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా చైతు సినిమాకన్నా యు- టర్న్ సినిమాకి కాస్త బజ్ తక్కువే ఉంది.

Samantha Promotes Sailaja Reddy Alludu Over U Turn:

Samantha Killing U Turn For Sailaja Sake!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs