ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా నుండి ఓ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే..ఈనెల 20న ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ జరగాల్సివుంది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. సాంగ్స్ అన్ని డైరెక్ట్ గా ఆన్ లైన్ లోకి వచ్చేస్తాయి అంట. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే..ఈనెల 20న ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ స్టార్టింగ్ లో జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రాయలసీమలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపాలనుకుంటున్న మేకర్స్. దానికి సంబంధించి వేదిక త్వరలోనే తెలియాజేయనున్నారు. అయితే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే...ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటు బాలయ్య బాబు, ఇటు చంద్రబాబు కూడా హాజరవుతారని గట్టి సమాచారం.
అక్టోబర్ 1 నుంచి 10లోపు డేట్స్ మధ్యలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయాలనీ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది డిస్కషన్ లో వుంది. చాలాకాలం తరువాత ఎన్టీఆర్-బాలయ్య-చంద్రబాబు ఓ వేదిక మీదకు రావడం అనేది నందమూరి ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త. ఖచ్చితంగా ఓ అపూర్వమైన కార్యక్రమంలా వుంటుంది.