Advertisement
Google Ads BL

‘2.O’ టీమ్ షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నారుగా?


'బాహుబలి' రెండు పార్టులు కలిపితే ఐదున్నర గంటలు లోపే నిడివి ఉంటుంది. ఈ సినిమా రెండు పార్టులు కలిపితే నాలుగు వందల కోట్లు ఖర్చు అయింది. అలాంటిది శంకర్ సృష్టించిన  '2.0' చిత్రానికి 75 మిలియన్‌ డాలర్లు బడ్జెట్ అయిందని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. కేవలం గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రంతో 'బాహుబలి' బడ్జెట్ ను దాటేశామని చెబుతున్నారు  '2.0' మేకర్స్.

Advertisement
CJ Advs

ఈ మూవీ కోసం ఏకంగా వందల పాతిక కోట్లకి పైగా ఖర్చు అయిందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి నిజానికి ఇంత ఖర్చు అయిందో లేదో తెలియదు కానీ ఈ సినిమాను తెరకెక్కించేందుకు భారీగా డబ్బు అయితే వృధా అయిందని అర్ధం అవుతుంది. మొదట ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఓ ప్రముఖ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ వారు ఉన్నట్టుండి దివాలా తీయడంతో ఆ వర్క్ మొత్తం వదిలేసుకుని వేరే కంపెనీలకి కాంట్రాక్ట్‌  ఇచ్చారు.

కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కే చాలా ఖర్చు అయిందని చెబుతున్నారు. దానికి తోడు సినిమా బాగా లేట్ అయింది. దాంతో వడ్డీలు ఎక్కువ అయ్యిపోయాయి. అందుకే ఈ సినిమాకి తెలియని ఖర్చు అయిందని తెలుస్తుంది. ఏదేమైనా ఇది భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తోంది. బడ్జెట్ అయితే ఇంత అయింది మరి కలెక్షన్స్ ఆ విధంగానే వస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక ఈ చిత్రం టీజర్ ఈనెల 13న రిలీజ్ అవ్వబోతోంది. అలానే సినిమా నవంబర్ 29న విడుదల అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Shocking Budget to 2.0 movie:

2.0 Team Shocks Everyone 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs