కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. తండ్రి రౌతు విజయ వెంకటేశ్వరరావుని కోల్పోయారు. రౌతు విజయ వెంకటేశ్వరరావు వయసు 72 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (10-9-18) రాత్రి ఎనిమిది గంటలకు తుది శ్వాస విడిచారు.
సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం రవితేజ హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇంకా పేరు పెట్టని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది.