Advertisement
Google Ads BL

అందుకే నయన్‌ని సూపర్‌స్టార్ అనేది?


సినిమా అనేది డిమాండ్‌ అండ్‌ సప్లై ఆధారంగా ఉంటుంది. నటీనటులు, దర్శకుల పారితోషికం వారికి ఉండే డిమాండ్‌ మీద, సక్సెస్‌, క్రేజ్‌, ఒంటిచేత్తో థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించగలిగిన స్టామినా మీద ఆధారపడి ఉంటాయి. అయితే హీరోలు ఎంత ఫ్లాప్‌లో ఉన్నా తమ పారితోషికం విషయంలో మాత్రం రాజీపడకపోయినా కూడా వాటిని పెద్దవి చేసి చూడరు. అదే మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ అయిన సినిమా ఫీల్డ్‌లో ఓ హీరోయన్‌ మాత్రం తన డిమాండ్‌కి తగినట్లుగా పారితోషికం డిమాండ్‌ చేసినా, లేదా షరతులు పెట్టినా దాని గురించి ఉన్నవీ లేనివి ప్రచారం అవుతూ వారిని డామేజ్‌ చేయడానికి పన్నాగాలు పన్నుతుంటారు. ఇక విషయానికి వస్తే నేడు దక్షిణాదిలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నయనతార లేడీ సూపర్‌స్టార్‌ అనేది ఒప్పుకొని తీరాలి. కానీ ఆమె మీద మాత్రం ఎంతో కాలంగా దుష్చ్రచారం జరుగుతోంది. ప్రమోషన్లకు రాదని, హీరోలను లెక్కచేయదని వార్తలు వస్తూనే ఉంటాయి. అదే హీరోలు ప్రమోషన్లకు రాకపోయినా, ఫలానా హీరోయిన్‌తో చేయమని చెప్పినా మౌనంగా ఉండేవారు మాత్రం హీరోయిన్లు అదే పని చేస్తే దానిని పొగరుగా, అహంకారంగా చిత్రీకరిస్తూ ఉంటారు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల నయనతార తన ఒంటిచేత్తో 'కొలమాను కోకిల' చిత్రం విజయం దిశగా నడిపించి సంచలనం సృష్టించింది. దీనిని ఇంకా ఎవ్వరూ మర్చిపోకముందే మరో అద్భుత చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన 'ఇమైకా నోడిగల్‌' చిత్రం తమిళనాట సంచలనంగా మారింది. ఈ చిత్రంతో హీరోగా అధర్వ నటించాడు. విలన్‌ పాత్రను బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ పోషించగా, అతిధి పాత్రను విజయ్‌సేతుపతి చేశాడు. కానీ ఈ చిత్రానికి క్రౌడ్‌పుల్లింగ్‌ పాయింట్‌ మాత్రం కేవలం నయనతారే అనడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రంతో ఆమె దక్షిణాదిలోనే పలువురు హీరోలకు సరిసమానమైన పారితోషికం తీసుకునే స్థితిలో భారీగా పారితోషికం పెంచిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం విషయంలో ఆమె చూపిన ఉదారతను మాత్రం అందరు మర్చిపోతున్నారు. 

ఈ చిత్రం పూర్తయినా గానీ విడుదల కాలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. అభిరామి రామనాధన్‌ వంటి వారితో పాటు తనకు రావాల్సిన 50లక్షల పారితోషికాన్ని కూడా నయన వద్దని చెప్పి ఈ చిత్రం విడుదలయ్యేందుకు సహకరించింది. సాధారణంగా అందరి పేమెంట్స్‌ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఏ చిత్రమైనా విడుదలకు నోచుకుంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో నయన ఎంతో పెద్దమనసు చేసుకుంది. మొదట ఈమె పాత్రకు మమ్ముట్టిని తీసుకోవాలని భావించారు. కానీ చిత్ర కథను ఫిమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌గా మార్చి తీసినా కూడా ఈ చిత్రం మమ్ముట్టి నటించైనా కూడా సాధించలేని విజయాన్ని నయన ఒంటిచేత్తో సాధించి చూపించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Nayanathara.. Lady Super Star:

Nayanthara Greatness Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs