సాధారణంగా మగవారైనా, ఆడవారైనా మరీ ముఖ్యంగా నేటితరంలో వివాహం అంటే స్వేచ్చ, స్వాతంత్య్రాలను పొగొట్టుకోవడంలా భావిస్తూ ఉంటారు. అందులో నేటి సమాజంలో కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు, సహ జీవనాలు పెరిగిపోతున్నాయి. కానీ అర్ధం చేసుకునే కుటుంబం, భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటే పెళ్లి అనేది మనిషికి ఎక్కడలేని కొండంత బలాన్ని, ఆత్మస్దైర్యాన్ని ఇస్తుంది. మనకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి ఒకరు తోడుగా ఉన్నారు అనే భావనే మనిషికి కొండంత బలం ఇస్తుంది. ఈ విషయంలో నేటి యంగ్ టాలీవుడ్ కపుల్ అయిన సమంత, నాగచైతన్యల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
మరీ ముఖ్యంగా తన భర్త, అత్తమామల అండతో ఈమె ఏనాడో ముగిసి పోయిన పాతతరం సంప్రదాయాన్ని తెలుగులోకి మరలా తెచ్చింది. పెళ్లయిన తర్వాత హీరోయిన్ల కెరీర్ ఇక ముందుకు సాగదు అనే భ్రమను సమంత చెరిపివేయడమే కాదు.. ఇలాంటి భ్రమలోనే బతుకుతున్న తన తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈమె తన బికినీ ఫొటోలను సైతం పోస్ట్ చేయగల గుండె దమ్ము ఉంది. ఎవరేమనుకున్నా తనకి నచ్చినట్లుగా ఉంటూ, అందుకు తన భర్త, మామయ్యల పూర్తి మద్దతును పొందిన ఆమె తెరపైనే కాదు.. సోషల్‌మీడియాలో కూడా తన గట్స్‌ని ఎప్పుడో నిరూపించుకుంది. అయితే ఆమె తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిపింది.
తన ఫొటోలను తప్ప తన భర్త నాగచైతన్యకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మాత్రం పోస్ట్ చేయాలంటే తన భర్త అనుమతి తీసుకునే చేస్తాను గానీ నా సొంతగా నేను చేయను అనే రహస్యాన్ని తెలిపింది. నిజమే.. ఈ మాత్రం అండర్‌స్టాండింగ్, ఎదుటి వారి మనస్తత్వాన్ని, వారి అభిప్రాయాలను ఆ మాత్రం గౌరవించినప్పుడే సరైన దారిలో పయనించడం అవుతంది. ఇక సమంత నటించిన 'యుటర్న్' చిత్రంతో పాటు నాగచైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు'కూడా 13వ తేదీనే విడుదల కానున్నాయి. సినిమాని సినిమాగా, జీవితాన్ని జీవితంగా చూసే వారికే ఇది సాధ్యమని చెప్పాలి.