Advertisement
Google Ads BL

‘గీతగోవిందం’.. ఇలా ఊహించి ఉండరు


చిన్న సినిమాగా విడుదలై చితక్కొట్టే కలెక్షన్స్ తో స్టార్ హీరోలకు సైతం చమట్లు పట్టిస్తున్న విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాకి మూడు వారాలుగా ఎదురులులేకుండా పోయింది. ఇక ఈ వారం కూడా కేరాఫ్ కంచరపాలెం మినహా గీత గోవిందానికి అడ్డుపడే సినిమా లేకపోవడంతో.. మరో వారం దున్నేయ్యడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన గీత గోవిందం సినిమాని బన్నీ వాస్ తక్కువ బడ్జెట్ తో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన దగ్గరనుండి ప్రతి వారం గట్టి సినిమా, హిట్టు సినిమా ఎదురుకాకపోవడంతో... ఈ సినిమా అనూహ్యంగా 100 కోట్ల క్లబ్బులోకి మూడో వారంలోనే అడుగుపెట్టేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు.

Advertisement
CJ Advs

ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న గీత గోవిందం ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని సాధించి బిగ్ మూవీస్ సరసన చేరేందుకు పరుగులు పెడుతుంది. ఈ వారం కూడా సరైన సినిమాలు థియేటర్స్ లో లేకపోవడం.. గీత గోవిందం సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉండడంతో .. గీత గోవిందం కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో నైజాం స్టార్ హీరో అనిపించుకుంటున్న విజయ్ దేవరకొండ గీత గోవిందం తో ఇప్పటివరకు 18.60 కోట్లు షేర్ సాధించాడు. ఇక ఈ వారంలో మరో కోటి లాగేస్తే గనక గీత గోవిందం సినిమా కలెక్షన్స్ తో దుమ్ము దులిపిన బాహుబలి, బాహుబలి 2, రంగస్థలం, అత్తారింటికిదారేది, మగధీర, శ్రీమంతుడు, డీజే సినిమాల సరసన చేరిపోయే అవకాశం ఉంది.

మరో కోటి షేర్ దాటితే గీత జీవిందం సినిమా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, మహేష్ భరత్ అనే నేను, చిరు ఖైదీ నెంబర్ 150  సినిమాలకు షాకిచ్చినట్లే. ఇప్పటికే జనతా గ్యారేజ్ ని దాటేసింది. ఇక ఇపుడు భరత్ కి, ఖైదీ కి స్పాట్ పెట్టింది. మరి చాలా చిన్న సినిమాగా భారీ అంచనాల నడుమ  విడుదలైన గీత గోవిందం జోరు ఈ రేంజ్ లో ఉంటుందని కనీసం నిర్మాతలు కూడా ఊహించలేదు. అందుకే ఈ సినిమాని చాలాచోట్ల తక్కువ ధరకు అమ్మేశారు. నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ వస్తే.... ఇప్పుడు గీత బయ్యర్స్ మాత్రం చిన్న సినిమాతో అద్భుతమైన లాభాలను వెనకేసుకుంటున్నారు. పెద్ద సినిమాల్తో పోగొట్టుకుంది.. ఇలాంటి చిన్న సినిమాల్తో కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. 

Records Break at Nizam with Geetha Govindam:

Vijay Deverakonda Creates Sensation with Geetha Govindam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs