Advertisement
Google Ads BL

తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం: విక్రమ్


పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటుస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో అతి త్వరలో విడుదల కానుంది.  

Advertisement
CJ Advs

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు..’’ అన్నారు. 

హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో నేను చేస్తున్న కొత్త అటెంప్ట్ ఈ ‘సామి’ చిత్రం. కమర్షియల్ ఎమోషనల్ పిక్చర్ ఇది. నాకు పెద్ద హిట్ ఇచ్చి నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టాడు హరి. ఎప్పటి నుంచో సామి చిత్రానికి సీక్వెల్ చేయాలని అనుకున్నాము కానీ 15 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్ కష్టపడాల్సి వచ్చింది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆమెకు మహానటి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. సామిలో  కామెడీ ట్రాక్ లో నటించింది. ఇక విలన్ రోల్ ప్లే చేసిన బాబీ నాకు మంచి మిత్రుడు. నాకు ఈక్వల్ గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకోసం తాను 6నెలలు ఎదురుచూశాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. అందరి కష్టపడి సినిమా చేశాం.  తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా. తమిళంలో కూడా అతి త్వరలో విడుదల అవుతుంది’’ అన్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్న నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... ‘‘ట్రైలర్ తోనే హరి గారు దుమ్ము దులిపేశారు. విక్రమ్ గారి సినిమాలను మేము వదలలేక పోతున్నాము. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం ఈ సినిమా పెద్ద ఎస్సెట్. ఏషియన్, స్టార్ మా వారు సినిమాను తీసుకున్నారు. 4 రోజుల్లో ఆడియో విడుదలతో మీ ముందుకు వస్తాము’’ అన్నారు. 

నిర్మాత శిబు, ఆర్ ఆర్ సినిమాస్ మహేష్, కెవివి సత్యనారాయణ, దుర్గం గిరీష్, శోభారాణి, బాబీ సింహ(విలన్), సునీల్ తదితరులు ఈ ట్రైలర్ లాంచ్ కు విచ్చేసి తమ అభినందనలను, అభిప్రాయాలను పంచుకున్నారు. 

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్.

Saamy Trailer Released:

Saamy Trailer Release Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs