Advertisement
Google Ads BL

‘అర‌వింద స‌మేత‌’ ఆడియో: షాకింగ్ అప్‌డేట్


నందమూరి హరికృష్ణ అకాల మరణం తర్వాత ఆయన చిన్న కర్మ నాడు ఓ వీడియో బయటికి వచ్చి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్ భోజనం చేస్తున్న టైములో బాబాయ్ బాలకృష్ణ వచ్చి మాట్లాడిన వీడియో బయటికి రావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అక్కడ వారు ఏమి మాట్లాడుకున్నారని మొన్నటివరకు చర్చ జరిగింది. ఇప్పుడు ఇక నందమూరి హీరోలు అంతా ఒకటేనని..హరికృష్ణ మరణం తర్వాత కలిసిపోయారని అంతా భావిస్తున్నారు. ఈనేపధ్యంలో ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత‌’ ఆడియో ఫంక్ష‌న్‌కి బాల‌య్య ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని ప్ర‌చారం కూడా సోషల్ మీడియాలో మొదలైంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈనెల 20న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ నిర్వహిస్తున్నారని దానికి ముఖ్య అథితిగా బాలయ్య రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి బాలయ్య ఆ ఈవెంట్ కు రావడంలేదు. అంతేకాదు ఆడియో లాంచ్ ఘ‌నంగా చేసుకోవ‌డం కూడా ఎన్టీఆర్‌కి ఇష్టం లేదు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ఆడియో ఫంక్షన్ జరిగినా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా..డాన్సులు, పాట‌లూ అంటూ హోరెత్తించ‌కుండా చాలా సింపుల్ గా కానిచ్చేయాల‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.

సో అందుకే ఆ ఫంక్షన్ కు బాలయ్య అటెండ్ అవ్వడం కష్టమని అంటున్నారు. వారిద్దరూ ఒకే స్టేజి మీద కలవడం..కలిసి మాట్లాడటం.. ఇంకొంచెం టైమ్ పడుతుందని కొంతమంది దగ్గర వ్యక్తులు చెబుతున్నారు. మరోపక్క హరికృష్ణ మరణం తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా తన తండ్రి గురించి ఏం మాట్లాడతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Aravinda Sametha Audio Launch Update:

Aravinda Sametha Audio Launch on September 20
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs