Advertisement
Google Ads BL

ఈ యువ హీరోకి చిరంజీవే స్ఫూర్తంట!


నేటితరం యంగ్‌ హీరోలు, దర్శకులు ప్రతి ఒక్కరు నిజమైనా కాకపోయినా కూడా చిరంజీవే తమకు స్పూర్తి అని చెబుతూ ఉంటారు. ఇందులో మెగాభిమానులను మెప్పించే తరహా యోచన కూడా ఉండే ఉంటుంది. ఇక తాజాగా హీరో నిఖిల్‌ కూడా తనకు హీరో కావాలనే దానికి స్ఫూర్తి మెగాస్టార్‌ చిరంజీవినే అని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా మాట్లాడుతూ... చిరంజీవి గారి 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రం చూసిన తర్వాత నటునిగా కావాలని ఆశ పుట్టింది. అది నాతో పాటు పెరుగుతూ వచ్చింది. 'హ్యాపీడేస్‌' సమయానికి వెండితెరపై ఒక్కసారైనా కనిపించాలని కోరుకున్నాడు. అది నెరవేరిన తర్వాత సోలో హీరోగా కనిపించాలని భావించాను. 

Advertisement
CJ Advs

'యువత' చిత్రంతో అది కూడా నెరవేరింది. ఆ తర్వాత 'స్వామిరారా... కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా'వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాను. నా ఈ కెరీర్‌ పట్ల నేనెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో నాతోటి హీరోలను, వారి స్థాయిని చూసి ఏనాడు ఈర్ష్యపడలేదు. .. అని చెప్పుకొచ్చాడు. 

ఇక నిఖిల్‌ తాజా విషయానికి వస్తే ఆయన నటించిన 'కేశవ' చిత్రం పెద్దగా ఆడలేదు. ఆ సినిమాపై ఉన్న అంచనాలను ఆ చిత్రం కొంత వరకే నెరవేర్చింది. ఆ తర్వాత ఆయన కన్నడలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన 'కిర్రాక్‌పార్టీ' రీమేక్‌లో నటించాడు. ఇది కూడా కేవలం సో..సో అనిపించింది. ప్రస్తుతం ఆయన తమిళంలో ఘనవిజయం సాధించిన 'కణితన్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న 'ముద్ర' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు. మరి ఈ చిత్రమైనా మరలా నిఖిల్‌ని హిట్‌ ట్రాక్‌లోకి తెస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Chiranjeevi is my Inspiration, Says Nikhil:

I am Happy with my Carrier: Nikhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs