ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఒకప్పుడు వరుసగా ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మరలా నిలదొక్కుకునే అవకాశాలు ఉండేవి. కానీ నేడు రోజుకో యువ సంచలనం తెర మీదకు వచ్చి పరిచయం అవుతోంది. విజయ్‌దేవరకొండ, నాని, శర్వానంద్, నిఖిల్, ‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ, నాగచైతన్య, అఖిల్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నాగచైతన్య ఇలా పోటీ విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి చిత్రం, ప్రతి విజయం కీలకంగా మారుతున్నాయి. ఇక మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయమై మధ్యలో ఎప్పుడో చేసిన ‘రేయ్’ తప్పించి, ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్, సుప్రీమ్’ చిత్రాలతో కాబోయే పెద్ద మాస్ స్టార్‌గా సాయిధరమ్‌తేజ్ గుర్తింపును తెచ్చుకున్నాడు. కేవలం ఈ మూడు హిట్స్‌తోనే 25కోట్ల మార్కెట్‌ని సాధించుకున్నాడు. ఒకానొక సమయంలో అందరు వరుణ్‌తేజ్ కంటే సాయిధరమ్‌తేజ్‌కే రాబోయే రోజుల్లో మంచి స్టార్‌డమ్ ఖాయమని పేరు వచ్చింది. కానీ అంతలో పరిస్థితి తారు మారు అయింది.
వరుణ్‌తేజ్ వరుసగా ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి చిత్రాలతో నేటి ప్రేక్షకులు ఆశిస్తున్న వినూత్న చిత్రాల ద్వారా దూసుకెళ్తే.. ‘తిక్క , నక్షత్రం, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ చిత్రాలతో సాయి పరాజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. గోపీచంద్ మలినేని, వినాయక్, కృష్ణవంశీ, కరుణాకరన్ వంటి దర్శకులు కూడా ఆయనకి హిట్టుని అందించలేకపోయారు. మాస్ హీరో అంటే కేవలం రొటీన్ చిత్రాలే అన్న భ్రమలో ఈ మెగామేనల్లుడు ఉన్నట్టు ఉన్నాడు కాబోలు. ఇక ‘తేజ్ ఐ లవ్ యు’ తర్వాత సాయి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి వుంది. కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరింతగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటీవల ఈ మెగామేనల్లుడు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నాడట. దానికి కాస్ట్లీ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడని సమాచారం. అంతేకాదు ఆయన కాస్త బరువు తగ్గితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆ దిశగా కూడా కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. ఇక కాస్త గ్యాప్ తర్వాత కిషోర్‌తిరుమలతో ముందుకెళ్లి, ఆ తర్వాత ‘గీతాగోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చిన పరుశురాం దర్శకత్వంలో ఈయన గీతాఆర్ట్స్‌లో ఓ చిత్రం చేయనున్నాడని అంటున్నారు. మరి ఈ కసరత్తులైనా ఆయనకు కలసి వస్తాయో లేదో వేచిచూడాల్సివుంది..!