Advertisement
Google Ads BL

విజయ్‌ దేవరకొండకి భలే కలిసొస్తుంది


విజయ్‌దేవరకొండ... ఆయన చేసిన ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించడానికి ముఖ్యకారణం చేయాల్సిన సమయంలో ఎటువంటి చిత్రాలు చేయాలో ఖచ్చితంగా అటువంటి చిత్రాలే చేయడం ఒక కారణంగా చెప్పాలి. ప్రేక్షకులు ఏది ఆశిస్తారో? ఎప్పుడు ఏ చిత్రం చూడాలని భావిస్తారో ఆలోచించి మరీ ఖచ్చితంగా అలాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు రావడం విజయ్‌దేవరకొండలోని టైమ్‌ సెన్స్‌కి అద్దం పడుతుంది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ‘నోటా’. ఈ చిత్రం కూడా సరైన సమయంలో చేసిన సరైన చిత్రంగా భావించాలి. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని అందరు భావిస్తున్నప్పటికీ ముందస్తు ఎన్నికలు, దేశంలోనూ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలన్నింటిలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ఖచ్చితంగా ‘నోటా’ వంటి సబ్జెక్ట్‌తో విజయ్‌ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ప్లస్‌ పాయింట్‌గా నిలుస్తుందనే చెప్పాలి. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తమిళంలో బిగ్‌ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన స్టూడియో గ్రీన్‌ అధినేత జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో తెలుగుతో పాటు ఈ చిత్రంపై కోలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

Advertisement
CJ Advs

మెహ్రీన్‌, సత్యరాజ్‌, నాజర్‌ వంటి కీలక నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మెహ్రీన్‌, సత్యరాజ్‌, నాజర్‌ వంటి వారిపై కట్‌ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్‌లో విజయ్‌దేవరకొండ సాధారణ యువకుడిగాను, యువనాయకుడిగాను కనిపిస్తున్నాడు. ‘ఇది ముఖ్యమంత్రి పదవా? మ్యూజికల్‌ చైర్‌ ఆటా?’ అంటూ మెహ్రీన్‌ చెప్పిన డైలాగ్‌కు ‘ఒక స్టేట్‌ ఫ్యూచర్‌ అంతా ఓ స్వామీజీ చేతిలోనా?’ అనే విజయ్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘ఈ గేమ్‌లో నువ్వు చూసే రక్తం నిజం...నీ శత్రువులు నిజం.. ఆడటం మొదలుపెట్టావో ఆపడం నీ చేతుల్లో ఉండదు. లైఫ్‌ ఆర్‌ డెత్‌’ అంటూ నాజర్‌ చెప్పిన డైలాగ్‌ ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచడంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్ రాబట్టి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా దూసుకుపోతోంది. సరైన సమయంలో వస్తూ, ప్రస్తుత రాజకీయ వేడిని బాగా సొమ్ము చేసుకోబోయే చిత్రంగా ఇది కనిపిస్తోంది. మరి ఈ చిత్రంతో విజయ్‌కి మరో బ్లాక్‌బస్టర్‌ సిద్దంగా ఉందనే నమ్మకం ట్రైలర్‌ చూసిన అందరిలో కలుగుతోంది. 

Vijay Deverakonda Starring NOTA trailer Released:

Nota Trailer sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs