Advertisement
Google Ads BL

తమ్మారెడ్డి చేతుల్లో ‘ది ఫాగ్’


కొత్త కథలతో కొత్త కథనాలతో తెలుగు సినిమా  వెలిగిపోతుంది. ఘాజి, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, కేర్ అఫ్ కంచెరపాలం ఇలా ఎన్నో కొత్త చిత్రాలతో,  కొత్త కథనంతో, కొత్త నటీనటులతో విడుదలై విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం మరో కొత్త అంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. 

Advertisement
CJ Advs

మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఎమ్ వి రెడ్డి నిర్మాతగా  కొత్త నటీనటులతో 'ది ఫాగ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మధుసూదన్ దర్శకుడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన మొదటి ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. 'ఎమ్ వి రెడ్డి నిర్మాతగా మధుసూదన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ది ఫాగ్'. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను. సినిమా చాలా కొత్తగా ఉంది. కొత్త కెమెరాతో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్ లో సున్న ఉష్ణోగ్రతలో హాలీవుడ్ స్టైల్ లో తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా అంటున్నారు కానీ చాలా పెద్ద సినిమాగా కనిపిస్తుంది. ఈరోజుల్లో మనకి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా కావాలి, అలా తీస్తే సినిమాకి మంచి లాభం వస్తుంది అని నా అంచనా. ఈ సినిమా దర్శకుడు మధుసూదన్ కెరీర్ కి మరియు తెలుగు సినిమాకి మంచి మలుపు అవుతుంది' అని కోరుకున్నారు. 

నటి నటులు : విరాట్  చంద్ర,హరిణి,చందన,ఆత్మనంద,ప్రణీత,సతీష్ రెడ్డి,ప్రమోద్ ,చందు,మహేష్ రాజు

సాంకేతికనిపుణులు : కెమెరా : యల్లనూరు హరినాథ్,సతీష్ రెడ్డి,మ్యూజిక్  :సందీప్,పి ఆర్ ఓ  మధు బాబు VR,కో -ప్రొడ్యూసర్ :గోవర్ధన్  రెడ్డి, ప్రొడ్యూసర్ :M V రెడ్డి,డైరెక్టర్  :మధుసూదన్

Tammareddy Bharadwaja Launches The Fog Trailer:

The Fog Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs