Advertisement
Google Ads BL

నర్తనశాలకు రాంగ్ స్టెప్ అదే..!


'ఛలో' సినిమాతో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైములో నాగశౌర్య కి 'నర్తనశాల' రూపంలో షాక్ తగిలింది. ఈ చిత్రం అతి గోరంగా డిజాస్టర్ అయింది. 'ఛలో' సినిమాకి ఏ ఫార్ములా అయితే యూజ్ చేశాడో అదే ఫార్ములా 'నర్తనశాల' కి యూజ్ చేసిన ఫలితం లేకుండా పోయింది. 'నర్తనశాల' ఎట్టిపరిస్థితుల్లో హిట్ అవుతుందనే ధీమాతో తదుపరి చిత్రాలు కూడా తన బ్యానర్లో లైన్లో పెట్టాడట. నాలుగు స్టోరీస్ విని నలుగురు యంగ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టేశాడట.

Advertisement
CJ Advs

కానీ 'ఛలో'కి వచ్చిన డబ్బు మొత్తం 'నర్తనశాల'కి పోవడంతో అతని పేరెంట్స్‌ కూడా శౌర్య ఛాయిస్‌ని శంకిస్తున్నారట. అందుకే అతను విన్న కథలే మళ్ళీ మళ్ళీ వింటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరోపక్క తెలిసిన వారికి కథలు వినిపిస్తూ బాగుందా లేదా అంటూ ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకుంటున్నాడట. 'ఛలో' విషయంలో తీసుకున్న జాగ్రత్తలు 'నర్తనశాల' కి తీసుకోలేదని అంటున్నారు అతని దగ్గర వ్యక్తులు.

'ఛలో' తర్వాత వచ్చిన 'కణం', 'అమ్మమ్మగారిల్లు' రెండు డిజాస్టర్ కావడంతో త్వరత్వరగా 'నర్తనశాల' ను ఫినిష్ చేసి విడుదల చేయాలనీ చూశాడట. అందుకే ప్రొమోషన్స్ కూడా సరిగా చేయలేకపోయాడు అని అంటున్నారు. అందుకే రిజల్ట్ ఆలా వచ్చింది లేకపోతే వేరేలా ఉండేది అని చెబుతున్నారు. మరి నెక్స్ట్ సినిమాతో అయినా శౌర్య జాగ్రత్త పడతాడేమో చూద్దాం.

This is Wrong Step to Narthanasala:

Reason to Naga Shourya Narthanasala Flop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs