Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ ఆవిష్కరించిన 'అనగనగ ఓ ప్రేమకథ'


ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత 30 సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన 'ట్విట్టర్' లో ఆవిష్కరించి, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు గారు మాట్లాడుతూ.. థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ద్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం. ప్రతాప్ గారు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని వరుణ్ తేజ్ గారు ఆవిష్కరించటం సంతోషంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి. ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి హీరోగా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.. కె ఎల్ ఎన్ రాజు గారు బ్యానర్ స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది  అన్నారు.

హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ ఈ  సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు: రామకృష్ణ, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 

'Anaganaga o prema kadha' First look Launched:

'Anaganaga o prema kadha' film First look has been launched by MEGA PRINCE 'VARUNTEJ'  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs