Advertisement
Google Ads BL

‘మసక్కలి’ విడుదలకు డేట్ ఖరారైంది


కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ అంటూ ఓ కుర్రాడి యాంగిల్‌లో చెప్పబోతోన్నసినిమా ‘మసక్కలి’. ఇప్పటి వరకూ చూడని విధంగా ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందిన  ‘మసక్కలి’ వినాయక చవతి సందర్భంగా సెప్టెంబర్ 13న  విడుదలకు సిద్దం అయ్యింది. హీరో సాయి రోనక్, హీరోయిన్ శ్రావ్య, శిరీష ల పాత్రలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చిత్ర యూనిట్ అంటుంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత నమిత్ సింగ్ మాట్లాడుతూ:  ‘మసక్కలి’ ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. యూత్ పుల్ లవ్ లో కొత్త డైమన్షన్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు నబి యేనుగుబాల సక్సెస్ అయ్యారు. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు ఒక కొత్త పాయింట్ ని డిస్కస్ చేశాం. సినిమా కథనం తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని అన్నారు. పాటలు మధురా ఆడియో ద్వారా విడుదలై మంచి ఆదరణ పొందాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దం అయిన ‘మసక్కలి’ ఈ నెల 13న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తప్పకుండా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 

దర్శకుడు నబి యేనుగుబాల మాట్లాడుతూ :  'నేను మీడియా రంగం నుంచి వచ్చిన వాడినే. మసక్కలి సైకలాజికల్ గేమ్‌గా ఉంటుంది. అందమైన ప్రేమకథగా ఉంటూనే సైకలాజికల్‌గా ఓ కొత్త అనుభూతినిచ్చే కథనం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఓ న్యూఏజ్ లవ్ స్టోరీ. అందరకీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే పాటలు కూడా చాలా బావున్నాయి.  ‘మసక్కలి’ ఖచ్చితంగా మీ అందరికీ కొత్త అనుభూతినిస్తుందనే గ్యారెంటీ నాది' అన్నారు.

Masakkali Movie Release Date Fix:

Masakkali Movie Release on Vinayaka Chavithi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs