Advertisement
Google Ads BL

ప్రభాస్ త్రిభాషా చిత్రం మొదలైంది


ప్రతిష్టాత్మక గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం 

Advertisement
CJ Advs

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు కృష్ణంరాజు గారి సంస్థ కార్యాలయంలో జరిగాయి. గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో కృష్ణంరాజు గారి సమర్పణలో .... వరుస సూపర్ హిట్స్ అందిస్తున్న యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అందించిన కె కె రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది. త్వరలోనే  ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.  

'కె కె రాధాకృష్ణ దర్శకత్వంలో నేను నటించబోయే త్రిభాషా చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రారంభమైన ఈ చిత్రాన్ని గోపికృష్ణా మూవీస్... యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తోంది'. అని తన ఆనందాన్ని పంచుకున్నారు ప్రభాస్. 

బాహుబలి తర్వాత ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రావడంతో... రాబోయే చిత్రాల్ని అంతే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న సాహో చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మించేందుకు గోపికృష్ణా మూవీస్ ప్లాన్ చేస్తోంది. బిల్లా తర్వాత ప్రభాస్ రేంజ్ కి తగ్గ మంచి కథ కోసం ప్లాన్ చేశారు. కె కె రాధాకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో... యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని గ్రాండియర్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించనున్నారు. టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస... ప్రొడక్షన్ డిజైనింగ్ లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్.... తనదైన షార్ప్ ఎడిటింగ్ తో ఎన్నో అద్భుతమైన హిట్స్ లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం.  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండనుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ... ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాను. ఈ రోజు ప్రభాస్ కథానాయకుడిగా నటించే  ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గోపికృష్ణా మూవీస్ కృష్ణంరాజు గారి ఆఫీస్ లో ప్రారంభమైంది. గోపికృష్ణా మూవీస్ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో నిర్మించనున్నారు.  డార్లింగ్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొనే సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే చేయబోతున్నాం. అని అన్నారు.

Prabhas, Radha Krishna Film Launched:

Prabhas Clarifies About Pooja Hegde    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs