Advertisement
Google Ads BL

ఏం రాజమౌళి.. మరీ ఇంత సైలెంట్‌గానా?


టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల విషయంలో ఎంత సీక్రెట్ మెయింటింగ్ చేస్తాడో కొడుకు ఎంగేజ్మెంట్ విషయంలో అంతే సీక్రెట్ ని మెయింటింగ్ చేశాడు. తన కొడుకు కార్తికేయ ఎంగేజ్మెంట్ చేసేసి అందరికి షాకిచ్చాడు. రాజమౌళి దగ్గరే పనిచేసే కార్తికేయ టాలీవుడ్లో అందరికి సన్నిహితుడే. అయితే కార్తికేయ రాజమౌళి సినిమాల విషయంలో అన్ని తానై వ్యవహరిస్తాడు. అలాగే ఇతర వ్యాపారాల్లో కూడా కార్తికేయ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే కామ్ గా కొడుకు కార్తికేయ ఎంగేజ్మెంట్ ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశాడు. నిన్న ఒక్కరోజే సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిశ్చితార్ధం అంటూ వార్తలు రావడం.. రాత్రికల్లా కార్తికేయ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి రావడం అందరికి షాకిచ్చాడు.

Advertisement
CJ Advs

ఇంతకీ కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి... రాజమౌళి కోడలెవరో కాదు.... టాలీవుడ్ హీరో కమ్ విలన్ జగపతి బాబు అన్న కూతురు పూజని, రాజమౌళి తన కొడుక్కి జోడిగా ఎంపిక చెయ్యడం... ఇద్దరికీ ఘనంగా నిశ్చితార్ధం చేసేయ్యడం అంతా కామ్ గా సీక్రెట్ గా జరిగిపోయాయి. అయితే జగపతి బాబు అన్న కూతురు పూజ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ మనవరాలు మాత్రమే కాదు.. ఆమె ఒక మంచి సింగర్ కూడా. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆమె భక్తి ఆల్బమ్స్ చాలానే విడుదలయ్యాయి. మంచి సింగర్ మాత్రమే కాదు... మంచి చదువు కూడా పూజ సొంతం. ఇక నిన్న బుధవారం రాత్రి కార్తికేయ - పూజ నిశ్చితార్ధం కొద్ది మంది సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది.

ఇక ఆ నిశ్చితార్ధంలో అక్కినేని అఖిల్, బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ వంటి వారు పాల్గొన్న విషయం బయటికి లీకైన ఫొటోస్ ద్వారానే తెలిసింది. అయితే కార్తికేయ - పూజ ల జోడి చాల బాగుంది. ఆ ఫొటోస్ లో వాళ్లిద్దరూ జోడి చూడ చక్కగా ఉన్నాయో మీరు చూసి ఓ లుక్కేయండి. ఇప్పుడు కార్తికేయ - పూజ ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rajamouli's Son Karthikeya Gets Engaged:

Rajamouli's Son Gets Engaged  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs