ఈ శుక్రవారం భార్యాభర్తలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నారు. టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా చెప్పుకునే నాగ చైతన్య - సమంతల సినిమాలు ఈనెల 13 న రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇద్దరూ చాలా ప్లాన్డ్ గా వస్తున్నా కొన్ని నెగటివ్ సెంటిమెంట్స్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. అవేంటో చూద్దాం.. ఈ ఏడాది ఏ మాత్రం టాలీవుడ్ కి అచ్చి రాని గురువారం వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఏడాది గురువారం 8 సినిమాలు రిలీజ్ అయితే అన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ఇది ఒక సెంటిమెంట్ అయితే మరో సెంటిమెంట్ ఏంటంటే...'శైలజారెడ్డి అల్లుడు' లో హీరోయిన్ అను ఇమ్మానియేల్ నటించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇప్పటి వరకు తెలుగులో ఓ సరైన సక్సెస్ లేదు. డబ్బింగ్ మూవీ 'డిటెక్టివ్' తో పర్లేదు అనిపించుకున్న అది స్ట్రెయిట్ తెలుగు మూవీ కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేం. ఆమె ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలంటే 'శైలజారెడ్డి అల్లుడు' ఖచ్చితంగా హిట్ అవ్వాలి.
ఈ సినిమాకి మరో సెంటిమెంట్ ఏంటంటే ఇందులో రమ్యకృష్ణ, నాగ చైతన్యకు అత్తగా నటించింది. గత సినిమాలు చూసుకుంటే ఆమె అత్తగా నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. 'నా అల్లుడు' సినిమాలో ఆమె ఎన్టీఆర్ కు అత్తగా నటించింది. అది ఘోరంగా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ కు కమర్షియల్ గా ఒక్క హిట్ లేదు. ఇక సమంత 'యు టర్న్' సినిమాకి వస్తే ఇందులో ఆది పినిశెట్టి సపోర్టింగ్ రోల్ కాకుండా కీలక పాత్ర లేదా హీరోగా చేసిన ఏ మూవీ ఆడలేదు. సో ఇలాంటి నెగటివ్ సెంటిమెంట్స్ మధ్య ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సెంటిమెంట్స్ బ్రేక్ చేస్తూ ఈ సినిమాలు హిట్ అవుతాయేమో చూద్దాం.