Advertisement
Google Ads BL

జగ్గూభాయ్ లుక్ అదిరింది..!


తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జగపతిబాబు యమా స్పీడుగా  ఉన్నాడు. ఏ ముహూర్తాన ఆయన 'లెజెండ్‌' చిత్రంతో విలన్‌గా మారాడో గానీ ఇక అక్కడి నుంచి హీరో తండ్రి పాత్రలు, కీలకమైన రోల్స్‌, క్యారెక్టర్‌, సపోర్టింగ్‌ రోల్స్‌తో యమ రంజు మీదున్నాడు. ఇప్పటికే మోహన్‌లాల్‌ చిత్రంలో విలన్‌గా కూడా నటించి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 13 చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషలతో పాటు హిందీలో కూడా ఆయన హవా సాగుతోంది. ఇలా స్వింగ్‌లో దూసుకుపోతున్న జగ్గూభాయ్‌ తాజాగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రంలోని లుక్‌ లీక్‌ అయి వైరల్‌ అవుతోంది. 

Advertisement
CJ Advs

అజయ్‌ దేవగణ్‌ హీరోగా రూపొందుతున్న 'తానాజీ' చిత్రంలో ముసలివయసులో తెల్లగుబురు మీసాలతో కనిపిస్తున్న జగ్గూభాయ్‌ లుక్‌ ఫెరోషియస్‌గా ఉంది. గంభీరమే కాదు..ఈ లుక్‌లో ఆయన ఎంతో హుందాగా, పౌరుషంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 'తానాజీ' పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నాడు. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం ప్రకాష్‌రావత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన తాబేదారు తానాజీ గురించి చరిత్రలో అద్భుతంగా ఉంది. ఇందులో జగ్గూభాయ్‌కి సంబంధించిన పాత్ర కోసం ఇటీవల టెస్ట్‌షూట్‌ నిర్వహించారు. ఈ టెస్ట్‌ లుక్‌కి సంబంధించిన జగపతిబాబు లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, దేశంలోని ఇతర ప్రధాన భాషలన్నింటిలో రూపొందుతున్న ప్రభాస్‌ 'సాహో', మెగాస్టార్‌ చిరంజీవి 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రాలలో కూడా కీలకపాత్రలను పోషిస్తున్నాడు. తానాజీతో పాటు ఈ రెండు చిత్రాలతో జగపతిబాబు నేషనల్‌ వైడ్‌గా మరింత క్రేజ్‌ సాధించడం ఖాయమనే అంటున్నారు.

JagaPathi Babu New Look for BOllywood Movie:

Taanaji: The Unsung Warrior poster – Jagapathi Babu's first look goes viral, raises curiosity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs