ప్రస్తుతం ఇండియన్ స్టార్ ఎవరు అంటే ఎవరైనా ఠక్కున ప్రభాస్ పేరు చెబుతారు. ఆయన మాస్ ప్రేక్షకులనే కాదు.. యూత్‌ని, మహిళా, ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ ఉన్నాడు. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బేచురల్‌గా లేడీస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 'బాహుబలి' ముందు వరకు తెలుగు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న ఆయన 'బాహుబలి' చిత్రంతో దేశవిదేశీ యువతుల హృదయాలను కూడా కొల్లగొట్టాడు. తమకి ఎలాంటి భర్త కావాలి అంటే ప్రస్తుతం అందరు ప్రభాస్ వంటి వారే కావాలని చెబుతున్నారు. ఆయనకు సినీ హీరోయిన్లలో, బాలీవుడ్ హీరోయిన్లలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకు ముందు 'డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి' చిత్రాలతో ఆయన యువతుల మతులు పొగొట్టాడు. ఇండియన్ హీమ్యాన్‌గా, కండలవీరునిగా, కలల రాకుమారునిగా కూడా ఆయన నేడు నేషనల్ ఐకాన్‌గా నిలుస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన 'బాహుబలి' తర్వాత సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ బేనర్‌లో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఆయన 'జిల్' రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే చిత్రం షూటింగ్‌ని ఈ నెల 6వ తేదీన ముహూర్తం జరుపనున్నారు. ఇదో పీరియాడికల్ లవ్‌స్టోరీ అని, యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కథ రీత్యా 'సాహో' చిత్రంలో కూడా భారీ కండలతోనే కనిపించాల్సి వుండటంతో ప్రభాస్ 'సాహో'లో కూడా 'బాహుబలి' బాడీతోనే కనిపించనున్నాడు.
కానీ రాధాకృష్ణ చిత్రం లవ్‌స్టోరీ కావడంతో దాని కోసం ఏకంగా 10కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా మారనున్నాడట. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 'బాహుబలి' వంటి కనివినీ ఎరుగని హిట్ తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో', జిల్ రాధాకృష్ణ సినిమాల దర్శకులు ఇద్దరు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్నవారు మాత్రమే కావడం గమనార్హం.