Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ ట్రోలింగ్‌పై నాని వివరణ..!


చివరి అంకానికి చేరుకున్న 'బిగ్‌బాస్‌ సీజన్‌ 2'పై నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నూతన్‌నాయుడు ఎలిమినేషన్‌ సరిగా జరగలేదని, గీతామాధురి, తనీష్‌లలో ఎవరో ఒకరిని విజేతగా నిలిపేందుకే ఎక్కువ ఓట్లు వచ్చి నూతన్‌నాయుడుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు, హోస్ట్‌ నాని బయటకి పంపారని తీవ్ర వివాదం చెలరేగుతోంది. ఈ నేపధ్యంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నాని స్పందించాడు. 

Advertisement
CJ Advs

మీలో కొందరు బాధపడ్డారు. క్షమించండి. షో గురించి మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. షోలో మీకంటూ ఓ అభిమాన కంటెస్టెంట్‌ ఉంటాడు. వారిని మీరు ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తారు. కానీ హోస్ట్‌గా నేను ఏ ఒక్కరిని ప్రత్యేకంగా చూడను. చూడలేను. ప్రతి ఒక్కరిని సమానంగానే చూడాలి. నాకు ప్రతి ఒక్కరు సమానమే. ప్రత్యేకంగా ఏ ఒక్కరికో వత్తాసు పలుకుతున్నానని భావించవద్దు. నాపై నమ్మకం ఉంచండి. మీ అందరి మద్దతులోనే చివరికి ఓ విజేత గెలుస్తాడు. ఎలిమినేషన్స్‌ అన్ని మీ ఓట్లతోనే జరుగుతాయి. మీరు నన్ను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీనే. మీ ప్రేమను పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా.. అని ట్విట్టర్‌ వేదికగా నాని ఓ పోస్ట్‌ చేశాడు.నాని పాయింట్‌ ఆఫ్‌వ్యూలో చూస్తే ఆయన చెప్పేది కూడా నిజమేనని చెప్పాలి.

Nani Gives Clarity on Bigg Boss Issues:

Bigg Boss 2 Telugu Netizens Trolls On Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs